AP : పాఠశాలకు తాళాలు వేసిన గ్రామస్తులు.. పట్టించుకోని అధికారులు..!

కర్నూలు జిల్లా కందనాతిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలోని పాఠశాలకు టీచర్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.

New Update
AP : పాఠశాలకు తాళాలు వేసిన గ్రామస్తులు.. పట్టించుకోని అధికారులు..!

School Was Locked By The Villages : గత సంవత్సరము నుండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఉపాధ్యాయులు లేరని గ్రామస్తులు ఏకంగా  పాఠశాలకు తాళాలు వేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. కర్నూలు జిల్లా (Kurnool District) ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Also Read: ఇంజక్షన్‌ రియాక్షన్.. 24 మందికి సీరియస్..!

గత రెండు రోజుల నుండి పాఠశాలకు (School) గ్రామస్తులు తాళం వేస్తున్న అధికార యంత్రాంగం మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యా అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న నిమ్మకు నీరు ఎత్తనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. బడిపంతులు లేని పాఠశాల ఎందుకంటూ గ్రామ పెద్దలు ఫైర్ అవుతున్నారు. మరోవైపు విద్యార్థులు (Students) రోడ్డు ఎక్కి మాకు టీచర్ కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు