ఐదేళ్ల బాలికలపై స్కూల్ క్యాబ్ డ్రైవర్ దారుణం.. అక్కడికి తీసుకెళ్లి ఐదేళ్ల బాలికలపై స్కూల్ క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన బెగుసరాయ్‌లోని వీర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బడి నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో వాహనాన్ని ఏకాంత ప్రదేశంలో ఆపిన నిందితుడు అత్యాచారానికి పాల్పడగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. By srinivas 29 Nov 2023 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి అభం శుభం తెలియని ఐదైళ్ల ఆడపిల్లలపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బిహార్ రాష్ట్రంలో కలకలం రేపింది. ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పి ఎవరూ లేని ప్రాంతంలో కారు పార్కింగ్ చేసి వాళ్లపై అత్యాచారం చేశాడు. అదంతా వీడియో తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరికి అతనే ఆ ఇద్దరు బాలికను తమ ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. అయితే వారిద్దరూ జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. Also read :యువకుడి ప్రాణం తీసిన ప్రేయసి మెసేజ్.. ఏం పంపించిందంటే ఈ మేరకు బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఇద్దరు ఐదేళ్ల బాలికలపై పాఠశాల క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడి చేశాడు. ఇద్దరు బాలికలను ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఇంటికి దింపేందుకు తీసుకెళ్లిన నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో, నిందితుడు వాహనాన్ని ఏకాంత ప్రదేశంలో ఆపి వారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. లైంగిక వేధింపుల వీడియో క్లిప్పింగ్‌ను కూడా రూపొందించి, ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. తర్వాత బాలికలిద్దరినీ వారి వారి ఇళ్ల వద్ద వదిలిపెట్టాడు. బాధితులు తమ తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపిన వెంటనే బాలికలలో ఒకరి కుటుంబ సభ్యులు డ్రైవర్‌ను వెంబడించి పట్టుకున్నారు. వీర్పూర్ స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సదర్ బెగుసరాయ్ ఎస్‌డిపిఓ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడికి మూడేళ్లుగా ప్రైవేట్ పాఠశాలతో సంబంధం ఉందని, తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పాఠశాల క్యాబ్‌కు నిప్పు కూడా పెట్టారు. #sexually-assaults #cab-driver #five-years-girls మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి