Telangana: ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్

తెలంగాణలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 29లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది.

New Update
Telangana: ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్

Engineering Management Quota Seats: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ, బీఫార్మసీ తదితర కోర్సుల్లో బీ కేటగిరీ(మేనేజ్మెంట్) కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి మంగళవారం షెడ్యూల్ తో పాటు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈనెల 9 వరకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ, మైనార్టీ కాలేజీలు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని స్పష్టంచేసింది. దీన్ని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వవడంతో పాటు కాలేజీ వెబ్ సైట్లో పెట్టాలని ఆదేశించింది.

అడ్మిషన్ల ప్రక్రియను ఈనెల 29లోగా పూర్తి చేయాలని కౌన్సిల్ సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్ మేనేజ్మెంట్లకు ఆదేశించారు. స్టూడెంట్లు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం ఆరు వర్కింగ్ డేస్ అవకాశం ఇవ్వాలని సూచించారు. కాగా, ఇంజినీరింగ్ కాలేజీల్లో 70శాతం సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేస్తుండగా, 30శాతం మేనేజ్మెంట్ కోటాలో నింపుతారు. నిబంధనల ప్రకారమే మేనేజ్మెంట్ కోటా సీట్లను కాలేజీలు నింపాలని, లేకపోతే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also read:Delhi: అలర్ట్ గా ఉన్నాం.. బంగ్లాదేశ్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు