Savereign gold bond: ఆ గోల్డ్ బాండ్ మొదటి సిరీస్ మెచ్యూరిటీ…లాభం ఎంతో తెలిస్తే అదిరిపోతారు!

సావరిన్ గోల్డ్ బాండ్ లను ప్రభుత్వం తీసుకువచ్చి 8ఏళ్లు అయింది. అప్పుడు ఈ బాండ్ తీసుకున్నవారు ఇప్పుడు దానిని రీడిమ్ చేసుకోవచ్చు.  ఒక గ్రాముకు రూ.2,684 ఇష్యూ ధరతో ఈ బాండ్స్ జారీ చేశారు. ప్రస్తుతం IBJAలో బంగారం గ్రాముకు రూ.6,161గా ఉంది. దాదాపు 128% రాబడి రావచ్చు.

New Update
Savereign gold bond: ఆ గోల్డ్ బాండ్ మొదటి సిరీస్ మెచ్యూరిటీ…లాభం ఎంతో తెలిస్తే అదిరిపోతారు!

Savereign gold bond: బంగారంలో ఇన్వెస్ట్ చేయడం కోసం అందరూ ఆసక్తి చూపిస్తారు. అయితే, ఎక్కువగా బంగారాన్ని ఆభరణాలు లేదా బిస్కెట్ల రూపంలో కొని ఉంచుకోవడం చేస్తారు. భవిష్యత్ లో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయనీ.. అవసరం అయినప్పుడు కొని పెట్టుకున్న బంగారం అక్కరకు వస్తుందనీ మన దేశంలో ఎక్కువ శాతం ప్రజలు నమ్ముతారు. అది చాలావరకూ నిజం కూడాను. రిస్క్ తక్కువ ఉండే పెట్టుబడి సాధనాల్లో బంగారం కూడా ఒకటి. అయితే, బంగారాన్ని డిజిటల్ గా కూడా కొని పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది. వాటిలో ప్రభుత్వం తీసుకువచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్స్ ఒకటి. ఈ బాండ్స్ సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వం పరిచయం చేసింది. 

అందువల్ల సావరిన్ గోల్డ్ బాండ్(Savereign gold bond) మొదటి సిరీస్ నవంబర్ 30న మెచ్యూర్ అవుతుంది. ఈ బాండ్లను నవంబర్ 26, 2015న ఒక గ్రాముకు రూ.2,684 ఇష్యూ ధరతో జారీ చేశారు. ప్రస్తుతం IBJAలో బంగారం ధర గ్రాముకు రూ.6,161గా ఉంది. ఈ బాండ్ రిడెంప్షన్ ధర ఈ ధర చుట్టూ ఉంటుంది. దీని ప్రకారం, ఈ సిరీస్‌ని రీడీమ్ చేయడం ద్వారా, 128% కంటే ఎక్కువ రాబడిని పొందవచ్చు.

RBI చెబుతున్న దాని ప్రకారం, మొదటి సిరీస్ గోల్డ్ బాండ్లలో 9,13,571 యూనిట్లు (0.91 టన్నుల బంగారం) అమ్ముడయ్యాయి. నిబంధనల ప్రకారం, ఇష్యూ మెచ్యూరిటీ తేదీకి ముందు వారంలో ఇండియా బులియన్ - జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) నుంచి పొందిన 24 క్యారెట్ల బంగారం ధర.. ప్రారంభ 9 సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్‌ల రిడెంప్షన్ ధర ముగింపు ధరగా ఉంటుంది. మొదటి సిరీస్ నవంబర్ 30న మెచ్యూర్ అవుతుంది.  కాబట్టి రిడెంప్షన్ ధర నవంబర్ 20-24 ముగింపు ధరల సగటుగా ఉంటుంది.

IBJA ప్రకారం, బుధవారం బంగారం ధర 10 గ్రాములకు రూ. 366 పెరిగి రూ.61,616కి చేరుకుంది. ఈ ఏడాది మే 4న బంగారం రికార్డు స్థాయి రూ.61,646కు చేరింది. దీని ప్రకారం బంగారం ధర రికార్డు స్థాయి కంటే ఇప్పుడు రూ.30 మాత్రమే తక్కువ.

Also Read: పండుగలు అయిపోయాయి..భారీగా పెరిగిన బంగారం ధరలు!

నవంబర్ 2015లో ఒక పెట్టుబడిదారుడు రూ. 1 లక్ష గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, నవంబర్ 30 నాటికి అతనికి దాదాపు రూ. 2.28 లక్షలు (దీని కంటే కొంచెం ఎక్కువ లేదా తక్కువ ఉండే అవకాశం ఉంది) . అంటే ఈ పెట్టుబడితో 8 ఏళ్లలో దాదాపు రూ.1.28 లక్షల ఆదాయం వచ్చినట్లు లెక్క. 

పెట్టుబడిదారులు బంగారం ధరల పెరుగుదలతో పాటు మొదటి సిరీస్ గోల్డ్(Savereign gold bond) బాండ్లపై 2.75% వడ్డీని కూడా పొందుతారు. ఇది ఆరు నెలలకు గ్రాముకు రూ. 36.91 అవుతుంది, అయితే మొత్తం మెచ్యూరిటీ వ్యవధిలో అంటే 8 సంవత్సరాలలో, ఒక యూనిట్ (1 గ్రాము) రూ. 590.48 అవుతుంది. అయితే, సెప్టెంబరు 2016 తర్వాత జారీ చేసిన సిరీస్ గోల్డ్ బాండ్లపై వడ్డీ రేటు సంవత్సరానికి 2.75 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించారు. 

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు