Satya Raj : మహేష్ - రాజమౌళి సినిమాలో సత్యరాజ్.. స్పందించిన కట్టప్ప!

'వెపన్' మూవీ ట్రైలర్ లాంచ్ కి హాజరైన సత్యరాజ్ రాజమౌళి, మహేష్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మహేష్, రాజమౌళి సినిమాలో తాను నటించడం లేదని, ఒకవేళ నటించే ఛాన్స్ వస్తే వదులుకోను అని అన్నారు.

New Update
Satya Raj : మహేష్ - రాజమౌళి సినిమాలో సత్యరాజ్.. స్పందించిన కట్టప్ప!

Tamil Senior Actor Sathyaraj About Rajamouli, Prabhas : తమిళ సీనియర్ యాక్టర్ సత్యరాజ్ (Sathyaraj) ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ (Prabhas) 'బాహుబలి' లో కట్టప్ప పాత్ర ద్వారా సత్యరాజ్ తన నటనతో ఆడియన్స్ కి ఎంతో దగ్గరయ్యాడు.

'బాహుబలి' (Bahubali) తర్వాత అందరూ ఆయన్ని కట్టప్ప పేరుతోనే పిలవడం స్టార్ట్ చేశారు. అంతలా ఆ పాత్ర ప్రేక్షకులకి చేరువైంది. ఇక ప్రస్తుతం సౌత్ మూవీస్ లో కీలక పాత్రల్లో నటిస్తున్న సత్యరాజ్ 'వెపన్' మూవీ ట్రైలర్ లాంచ్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి, ప్రభాస్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Also Read : బాలయ్య మందు బాటిల్ పై స్పందించిన నిర్మాత.. అది గ్రాఫిక్స్ అంటూ!

రాజమౌళి - మహేష్ మూవీ.. ఛాన్స్ వస్తే వదులుకోను

'వెపన్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సత్యరాజ్ మాట్లాడుతూ.." రాజమౌళికి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటా. అయన వల్లే కట్టప్పగా ఈరోజు ఇండియా వైడ్ గా ఫేమస్ అయ్యాను. ఇక నా డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. మహేష్ (Mahesh Babu), రాజమౌళి సినిమాలో నేను నటించడం లేదు. ఒకవేళ నటించే ఛాన్స్ వస్తే వదులుకోను" అని అన్నారు. దీంతో సత్యరాజ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు