ఏపీలో ఒకేసారి రెండు ఊర్లను ముంచిన సర్పంచ్.. తీవ్ర ఆందోళనలో గ్రామస్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సర్పంచ్‌ చేసిన పని తోకాడ, మల్లంపూర్ గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మట్టి తవ్వకాలకోసం చెరువుకు గండి కొట్టించడంతో ఇళ్లలోకి నీరు చేరడంతోపాటు చేతికొచ్చిన ధాన్యం, పంట పోలాలు నాశనం అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.

New Update
ఏపీలో ఒకేసారి రెండు ఊర్లను ముంచిన సర్పంచ్.. తీవ్ర ఆందోళనలో గ్రామస్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సర్పంచ్‌ చేసిన పని తోకాడ, మల్లంపూర్ గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తోకాడలోని ఊర చెరువుకు సర్పంచ్ గండి కొట్టించడంతో ఈ రెండు ఊళ్లలోని కాలనీలు, పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పంటపొలాలు మునగడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల మధ్యకు నీళ్లు రావడంతోపాటు చేతికొచ్చిన ధాన్యం, మితగా పంట పోలాలు నాశనం అయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.

ఈ మేరకు ఇటీవల వచ్చిన తుపాను ఎఫెక్ట్ తో ఈ చెరువు నిండుకుంది. అయితే గ్రామ సర్పంచ్ దగ్గరుండి గండి కొట్టించడంతో జగనన్న ఇండ్లలోకి భారీగా నిరు చేరింది. ధాన్యం నీట మునిగింది. గ్రామస్థులు, జనసేన నాయకులు అక్కడకు చేరకుని ఆందోళన చేపట్టారు. వైసీపీ నాయకులు మట్టి తవ్వకాలకోసం వేలం పాట పాడుకున్నారని, ఇందులో భాగంగానే ఈ చర్యకు పాల్పడ్డరంటూ మండిపడుతున్నారు. చెరువులో మట్టి తవ్వకాలకు నీరు అడ్డుగా ఉందని, దీంతోనే గండి కొట్టినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అలాగే దీనిపై తమకు ముందుగా సమాచారం ఇస్తే బాగుండేదని, నష్ట పరిహారం ఎవరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Also read :ఎనిమిదేళ్ల బాలికపై పగ తీర్చుకున్న సైకో.. బెల్ట్‌తో కట్టేసి గొంతు..

అలాగే గంతలోనూ ఈ చెరువుకు లీజ్ కు తీసుకున్న నేపథ్యంలో భారీ నీరు చేరడంతో నష్టపోతున్నామని, నీరు బయటకు పంపిస్తేనే మట్టి తవ్వకాల పనులు జరుగుతయని వైసీపీ నాయకులు చెప్పినట్లు గ్రామస్థులు తెలిపారు. గేట్ల ద్వారా అయితే ఆలస్యం అవుతుందనే కారణంతో గండి కోట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరసనకు దిగిన గ్రామస్థులు, జనసేన తదితర పార్టీ నాయకులు వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దాదాపుగా 10 లక్షలకు పైగా నష్టపోయామని, తొకడ గ్రామంలోని పంచాయితిలో ఏ వ్యక్తి కూడా తమ బాధలు విని స్పందించే వారు లేరని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశువులు, పొలాలు మునిగిపోతాయని చెప్పిన వినలేదని, కోట్ల రూపాయలు ఇచ్చి ఎందుకు ఆగాలని ఎదురు దాడికి దిగినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలున్నాయని.. చట్ట పరంగా న్యాయ పోరాటం చేస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen-KA Paul: ట్రంప్ కు చెప్పా.. తర్వాత చచ్చే ఆ 100 మంది వీళ్లే.. కేఏ పాల్ సంచలన ప్రెస్ మీట్!

పాస్టర్ ప్రవీణ్ మృతి విషయాన్ని ట్రంప్ దృష్టికి తీసుకుని వెళ్లానని KA పాల్ తెలిపారు. న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానన్నారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు.

New Update

పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ గాంధీనగర్ లో ఈ రోజు మీడియాతో పాల్ మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్‌ ది హత్య అనే చెప్పేందుకు తన దగ్గర అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని హై కోర్టులో కూడా తాను చెప్పానన్నారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ కేసును ఛేదించడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. 24 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాలకు మద్యం తాగే అలవాటు లేదన్నారు. చనిపోయి 22 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్ట్ ఎందుకు బయటికి ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ఏం తమాషాలా.. గంటాపై టీడీపీ హైకమాండ్ సీరియస్!

ఎస్పీతో చంద్రబాబు ఎందుకు మాట్లాడారు..?

ఈ దుర్మార్గులు ప్రవీణ్ ను తాగుబోతుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎందుకు క్లోజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనకు ముందు ప్రవీణ్ కు చాలా బెదిరింపులు వచ్చాయన్నారు. బెదిరింపుల గురించి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ తో సీఎం చంద్రబాబు 45 నిమిషాలు ఎందుకు మాట్లాడారు..? అని అనుమానం వ్యక్తం చేశారు. 
ఇది కూడా చదవండి: Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!

రాష్ట్రంలో చర్చిలు ఎన్ని ఉన్నాయో పవన్ కళ్యాణ్ ఎందుకు ఆరా తీశారు..? అని ఫైర్ అయ్యారు. మరో 100 మంది పాస్టర్ లను టార్గెట్ చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు. ఈ విషయాన్ని ట్రాంప్ దృష్టికి తీసుకుని వెళ్లానన్నారు. ఇక్కడ న్యాయం జరగకపోతే FBI వరకూ తీసుకుని వెళ్తానని ప్రకటించారు. ప్రవీణ్ మద్యం తాగి ఉంటే విజయవాడలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 

(Pastor Praveen | telugu-news | telugu-latest-news )

Advertisment
Advertisment
Advertisment