/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-17T135835.150.jpg)
కార్తీ నటిస్తున్న ‘సర్దార్ 2’ చిత్ర షూటింగ్ రెండు రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ షూటింగ్‌లో ఓ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. చెన్నై, ప్రసాద్ ల్యాబ్స్‌లో వేసిన సెట్స్‌లో ప్రస్తుతం మేకర్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణలో భాగంగా 20 అడుగుల ఎత్తు నుంచి పడి స్టంట్‌మెన్ ఎజుమలై మృతి చెందినట్లుగా కోలీవుడ్ మీడియాలో నడుస్తోంది.