అదో రకమైన ప్రపంచం.. బాలీవుడ్ పై సన్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

యంగ్ బ్యూటీ సన్యా మల్హోత్రా బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక అద్భుత ప్రపంచంగా పేర్కొంది. ఇదొక అవకాశాల గని. ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంటుంది. కొత్తగా ఎవరు వచ్చినా బాలీవుడ్‌ సాదర స్వాగతం పలుకుతూనే ఉంటుందంటూ ప్రశంసలు కురిపించింది.

New Update
అదో రకమైన ప్రపంచం.. బాలీవుడ్ పై  సన్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సన్యా మల్హోత్రా బాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. ఈ సినీ పరిశ్రమలోకి ఎవరూ వచ్చినా గొప్పగా ఆహ్వానం పలుకుతారని, కొత్తవాళ్లను కూడా తొందరగా కలుపుకుపోతారంటూ అక్కడున్న కల్చర్ గురించి తెగ పొగిడేసింది. అలాగే తాను కొత్తలో వచ్చినప్పుడు అసలే బయపడలేదని, అందరూ సపోర్టుగా నిలిచారని తెలిపింది. అమీర్ ఖాన్ 'దంగల్'తో తనకు గుర్తింపు వచ్చిన తర్వాత కెరీర్ లో మరింత దూసుకుపోతున్నట్లు చెప్పింది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ అనుభవాలను షేర్ చేసుకుంటూ.. 'నిజం చెప్పాలంటే బాలీవుడ్‌ ఇండస్ట్రీ ఒక అద్భుత ప్రపంచం. అవకాశాల గని. ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంటుంది. ‘దంగల్‌’ సినిమా నా కెరీర్‌కి బాటలు వేసింది. ఇక్కడి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో కూడా అందరూ నాకు సుపరిచితుల్లాగానే అనిపించారు. నేనే కాదు.. కొత్తగా ఎవరు వచ్చినా బాలీవుడ్‌ సాదర స్వాగతం పలుకుతూనే ఉంటుంది. దంగల్ తర్వాత ‘పగ్లైట్‌’ నటిగా నాపై నాకు నమ్మకం కుదిరేలా చేసింది. నాలో ఆత్మవిశ్వాసం నింపింది' అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది.

Also read :చిరంజీవిపై క్రిమినల్ కేసు.. ఎవరినీ వదిలిపెట్టనంటున్న మన్సూర్

ఇక సూప‌ర్ హిట్ చిత్రం దంగ‌ల్‌లో అమీర్ ఖాన్ కూతురుగా న‌టించిన సన్యా విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకుంది. ఇక రీసెంట్‌గా ఈ అమ్మడు న‌టించిన‌ ‘మీనాక్షి సుందరేశ్వర్’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా 'ససురల్ వండర్ ఫూల్' అనే రొమాంటిక్‌ కామెడీ షోలో'అషిమా' అనే పాత్ర పోషిస్తోంది. ఇది అడిబుల్‌ ప్రసారమయ్యే ఓ పాడ్‌కాస్ట్‌. ఇదిలావుంటే.. ఇటీవల లవ్ బ్రేక‌ప్ విషయంపై కూడా ఓపెన్ అయింది. ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. నాలుగేళ్ళ రిలేషన్ తరువాత బ్రేకప్ అయ్యింది. దాని తరువాత నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఈ బ్రేకప్ ఎంతో బాధని ఇస్తుంది. విడిపోవడం కన్నా ఎక్కువ బాధ ఏది ఉండదు. అయితే మ‌న‌ల్ని కాద‌నుకున్న వారి గురించి ఆలోచించ‌డం వేస్ట్. అందుకే నేను ఇప్పుడు నా ఆరోగ్యం, కెరీర్‌పై ఫోక‌స్ పెట్టాన‌ంటూ చెప్పుకొచ్చింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు