Sankranthi Boxoffice war :సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్.. నెగ్గేదెవరు ?

2024 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ షురూ అయింది. సినిమా టాక్ ఎలా ఉన్నా కలక్షన్లకు డోకా ఉండదు. ఈ క్రమంలోనే పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి టార్గెట్ తోనే నిర్మించి రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి .. ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్లో నెగ్గేదెవరు ?

New Update
Sankranthi Boxoffice war :సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్.. నెగ్గేదెవరు ?

2024 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ షురూ అయింది. తెలుగు సినిమాకు సంక్రాంతి పండగ ప్రత్యేకమైందనే చెప్పాలి. సినిమా టాక్ ఎలా ఉన్నా కలక్షన్లకు డోకా ఉండదు. ఈ క్రమంలోనే పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి టార్గెట్ తోనే నిర్మించి రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి .. ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్లో నెగ్గేదెవరు ?

సంక్రాతి బరినుంచి తప్పుకుంటే బంపర్ ఆఫర్

2024 Sankranthi Boxoffice war : ఈ సంక్రాంతి పండ‌క్కి 5 సినిమాలు రిలీజకానున్నాయి. గుంటూరు కారం, హ‌నుమాన్ 12న, సైంధ‌వ్‌, ఈగ‌ల్ 13న‌, 14న నా సామి రంగ రిలీజ్ కు రెడీ అయ్యాయి. అయితే .. రోజుకు ఒక్క సినిమా రిలీజ్ అయితే ఇబ్బందేమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో ఏదో ఓ సినిమా ప‌క్క‌కు త‌ప్పుకుంటే మంచిద‌ని, అలా త‌ప్పుకొన్న సినిమాకి సోలో రీలీజ్ ఛాన్స్ ఇస్తామ‌ని దిల్ రాజు ప్ర‌క‌టించారు. అయితే.. ఒక్క‌రు కూడా ఈ ఆఫ‌ర్ తీసుకోలేదు. హ‌నుమాన్ వాయిదా ప‌డే ఛాన్సుంది అనుకొన్నారంతా. నార్త్ లో హనుమాన్ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసిన నేపథ్యంలో హనుమాన్ రిలీజ్ డేట్ ను మార్చడానికి మేకర్స్ ఇష్టపడలేదు.

ఇంకా షూటింగ్ పూర్తికాని నా సామిరంగా

నా సామిరంగ షూటింగ్ ఈ నెల 5 వరకు జ‌రుగుతూనే ఉండటంతో ఈ సినిమా కూడా రిలీజ్ డౌటే అనుకున్నారు. ఈసినిమా సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకొనే అవ‌కాశం ఉంద‌నుకొన్నారు. అయితే వాళ్లూ వెన‌క్కి వెళ్లేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. గుంటూరు కారం, సైంధవ్ ఈ సంక్రాంతి కోస‌మే చూచి చూస్తున్నాయి,.ఎలాగయితేనేం మొత్తానికి ఐదు సినిమాలూ తలపడేందుకు సిద్ధమయ్యాయి12న అందరూ గుంటూరు కారం మూవీ వైపె మొగ్గుచూపుతారు.మ‌రి ‘గుంటూరు కారం’ చూశాక ‘హ‌నుమాన్‌’ వైపు వెళ్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక.. 13న తేదీ రిలీజ్ అవ్వబొయె సైంధ‌వ్‌, ఈగ‌ల్ చిత్రా లకు సైతం వసూళ్లు డివైడ్ అవుతాయి. అప్ప‌టికి..గుంటూరు కారం, హ‌నుమాన్ బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఉంటాయి. అంటే.. ఇక్కడ థియేట‌ర్ల‌నీ పంచుకోవాల్సిందే.

ALSO READ:Chiranjeevi – Venkatesh – Saindhav : చిరు మూవీపై వెంకీ కామెంట్స్… సైంధవ్ విషయంలో జరిగేది ఇదే!!

వెంకీ 75కు ఎక్కువ థియేటర్స్

ఇక.. విక్టరీ వెంకటేష్ మటించిన వెంకీ 75 సైంధ‌వ్‌ మూవీకి అధిక సంఖ్యలో థియేట‌ర్లు ద‌క్కేలా తెర వెనుక సురేష్ బాబు వ్యూహాల్ని సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. ఇది వెంకీ న‌టించిన 75వ సినిమా. కాబ‌ట్టి.. కాస్త ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ మ‌రుస‌టి రోజు నాగార్జున నా సామి రంగా రిలీజ్ అవుతుంది .నాగ్ చేతుల్లోనూ కొన్ని థియేటర్లు ఉన్నాయి. ప‌రిస్థితి చూస్తుంటే స‌గం థియేట‌ర్లు గుంటూరు కారం, మిగిలిన సగం థియేట‌ర్ల‌తో 4 సినిమాలూ ఎడ్జ‌స్ట్ అవ్వాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. నిజానికి 11న ఖాళీగా ఉంది. ఆ రోజు గురువారం. సినిమా విడుద‌ల చేసుకొనేందుకు మంచి ఛాన్స్‌. కానీ… ఈ 5 సినిమాల్లో ఒక్క‌టి కూడా ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేదు. 10న ఓ సినిమా విడుద‌ల చేసుకొన్నా త‌ప్పేం లేదు. హ‌నుమాన్‌కి ఆ ఛాన్స్ ఉంది. కానీ… వాళ్లు మాత్రం 12నే వ‌స్తామంటున్నారు. సైంధ‌వ్‌, ఈగ‌ల్‌లో ఏ ఒక్క‌టి 10నో, 11నో వ‌చ్చినా స‌మ‌స్య కాస్త స‌ద్దుమ‌ణుగుతుంది. కానీ పండ‌గ రోజే రావాల‌న్న‌ది అందరూ భీష్మించుకుని కూర్చున్నారు.

2024 టాలీవుడ్ కి చాలా కీలకం

ఇక.. 2024 సంవత్సరం టాలీవుడ్ కి చాలా కీలకమనే చెప్పాలి. గతేడాది చాలామంది యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలు విడుదల కాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య మరి కొందరు క్రేజీ హీరోల సినిమాలు సైతం థియేటర్లలో విడుదల కానున్నాయి. చిరంజీవి సినిమా మాత్రం ఈ ఏడాది లేనట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, ఈగల్, హనుమాన్ సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ దేవర, చరణ్ గేమ్ ఛేంజర్, బన్నీ పుష్ప2, పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ప్రభాస్ ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.నటసింహం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.ఈ ఏడాది షూటింగ్ మొదలుకానున్న (Mahesh) మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది విడుదలవుతున్న సినిమాలలో పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తాయో చూడాల్సి ఉంది. టాలీవుడ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తాయో చూడాలి. మొత్తానికి ఈ 2024 ఏడాది రిలీజ్ అవ్వబొయె సినిమాల భవితవ్యం అంతా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల రిజల్ట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి.. ఏ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ లో నెగ్గేదెవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ALSO READ:Sivaji:మెగా ఫ్యామిలీపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!!

Advertisment
Advertisment
తాజా కథనాలు