'యానిమల్'లో శృతిమించిన శృంగారం.. విమర్శలపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ రిప్లై

‘యానిమల్‌’ సినిమాలో బోల్డ్ సీన్స్ విమర్శలపై డైరెక్టర్ సందీప్ వంగా ఆసక్తికర సమాధానం చెప్పారు. విమర్శల వల్ల సినిమాపై నెగెటివ్ ఏర్పడుతుంది. ఎక్కువసార్లు అబద్ధాన్ని ప్రచారం చేస్తే జనాలకు అదే నిజమనిపిస్తుంది. సినిమా చూసి అన్నీ నేర్చుకోవడానికి అది స్కూల్ కాదన్నారు.

New Update
'యానిమల్'లో శృతిమించిన శృంగారం.. విమర్శలపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ రిప్లై

Animal : ‘యానిమల్‌’ (Animal) సినిమాలో బోల్డ్ (Bold) సన్నివేశాలు పిల్లలను చెడగొడుతున్నాయనే విమర్శలపై డైరెక్టర్ సందీప్ వంగా (sandeep vandga)స్పందించారు. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక, త్రిప్రి డిమ్రి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలై బాక్సీఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే ఇందులో హీరోహీరోయిన్ల క్యారెక్టర్స్, ముఖ్యంగా రణ్ బీర్, విలన్ గా నటించిన బాబీ డియోల్ రేస్ సీన్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో పలువురు పేరెంట్స్, నెటిజన్లు సినిమా కంటెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా తాజా ఇంటర్వ్యూలో సందీప్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Pakistan elections:పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ యువతి సవీరా పర్కాశ్

ఈ మేరకు సినిమా తీయడంలోనే కాదు ఈసినిమాలోని కంటెంట్‌పై క్లారిటీ ఉండాలన్నారు. సీన్ బై సీన్‌ ఎందుకు అలా ప్రత్యేక ప్లానింగ్ ఉందని చెప్పారు. ఆసీన్ ఎందుకు అలా డిజైన్ చేశారనే విషయాన్ని చాలా క్రేజీగా చెప్పారు. విమర్శల వల్ల సినిమాపై నెగెటీవ్ ఏర్పడుతుంది. ఎక్కువసార్లు అబద్ధాన్ని ప్రచారం చేస్తే జనాలకు అదే నిజమనిపిస్తుంది. సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒకవేళ ‘యానిమల్‌’ కలెక్షన్లు రూ.350 కోట్ల దగ్గరే ఆగిపోయినట్లైతే.. విమర్శకులంతా దీన్ని ఫ్లాప్‌ అని ప్రకటించేవాళ్లు. నా దృష్టిలో రూ.100 కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా రూ.140 కోట్లు వసూల్‌ చేసినా.. అది హిట్‌ అయినట్లే. కానీ, విమర్శకులు మాత్రం ప్రేక్షకాదరణ పొందలేదని ప్రచారం చేస్తుంటారు. సినిమా చూసి అన్నీ నేర్చుకోవడానికి అది స్కూల్ కాదు కదా. అయినా క్లాస్ రూముల్లో తల్లిదండ్రుల నుంచి మంచి చెడులు తెలుసుకోలేని వారు సినిమా చూసి నేర్చుకుంటారని నేను భావించను. దేవుడి దయ, నేను పడ్డ కష్టం వల్ల నా మూడు సినిమాలు విజయం సాధించాయి. నేను ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను. అందుకే నా సినిమాలను కూడా ఆ స్థాయి వాటితోనే పోల్చుకుంటాను. విమర్శలపై దృష్టి పెట్టను' అంటూ కుంబ బద్ధలు కొట్టేశాడు సందీప్ వంగా. ఇక ఈ మూవీ జనవరి లాస్ట్ వీక్ లో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుండగా మరో తొమ్మిది నిమిషాల సీన్స్ యాడ్ చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు