Samsung Music Frame: డాల్బీ అట్మోస్‌తో వస్తున్న శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్‌..

శామ్సంగ్ భారతదేశంలో మ్యూజిక్ ఫ్రేమ్‌ను ప్రారంభించింది. ఇది స్టైలిష్ వైర్‌లెస్ స్పీకర్, దీనిని మీరు మీ గదిలో గోడకి కూడా వేలాడతీయొచ్చు. మీరు దీన్ని పోర్టబుల్ పద్ధతిలో కూడా ఉపయోగించవచ్చు.

New Update
Samsung Music Frame: డాల్బీ అట్మోస్‌తో వస్తున్న శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్‌..

Samsung Launches Music Frame in India: శామ్సంగ్ భారతదేశంలో ఒక కొత్త ఉత్పత్తి, శామ్సంగ్ మ్యూజిక్ ఫ్రేమ్‌ను ప్రారంభించింది. ఇది స్టైలిష్ వైర్‌లెస్ స్పీకర్, దీన్ని మీరు పిక్చర్ ఫ్రేమ్ లాగా మీ గదిలో ఉంచుకోవచ్చు. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మరియు మీ గదిని మరింత అందంగా చేస్తుంది.

అద్భుతమైన ధ్వని నాణ్యత
మ్యూజిక్ ఫ్రేమ్ మీకు లీనమయ్యే త్రీ-డైమెన్షనల్ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. అంటే మీకు ఇష్టమైన పాటలను క్రిస్టల్ క్లియర్ సౌండ్‌లో వినవచ్చు. దీని సౌండ్ చాలా బాగుంది కచేరీలో కూర్చుని సంగీతం వింటున్నట్లు అనిపిస్తుంది.

వాయిస్ అసిస్టెంట్ మద్దతు
ఇది వాయిస్ అసిస్టెంట్ సదుపాయాన్ని కలిగి ఉంది, తద్వారా మీరు మీ చేతులను ఉపయోగించకుండానే నియంత్రించవచ్చు. మీ వాయిస్‌తో ఏదైనా సరే చెప్పిన వెంటనే అది మీ ఆదేశాలను పాటిస్తుంది. ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ముఖ్యంగా మీరు మీ చేతులతో ఇతర పనులు చేస్తున్నప్పుడు.

వ్యక్తిగత ఫోటో ప్రదర్శన
మీరు మ్యూజిక్ ఫ్రేమ్‌ని మీ వ్యక్తిగత ఫోటో ఫ్రేమ్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో మీకు ఇష్టమైన ఫోటోలు పెట్టుకోవచ్చు. ఇది మీ సంగీత అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, మీ గదిని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment