ఇద్దరు పిల్లలకు తల్లి కాబోతున్న సమంత.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్ స్టార్ నటి సమంత ఇద్దరు పిల్లలకు తల్లికాబోతుంది. దాదాపు 11 ఏళ్లుగా ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తున్న ఆమె ఈ సంస్థలో ఇద్దరు చిన్న పిల్లలను దత్తత తీసుకోబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. By srinivas 23 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి స్టార్ నటి సమంత ఎట్టకేలకు ఇద్దరు పిల్లలకు తల్లి కాబోతుంది. కొన్నేళ్లుగా తమ అభిమాన నటి తల్లి అయితే చూడాలని కలలు కంటున్న అభిమానుల డ్రీమ్ నెరవేరబోతుంది. నాగచైతన్యతో విడిపోయిన సమంత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా ఆమె మరో పెళ్లికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు. ఈ క్రమంలోనే ఆమెను ఒంటరిగా చూడలేక ఎంతోమంది ఫ్యాన్స్ మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సందర్భంలోనే సామ్ తాను సహాయం అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థనుంచి ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. Also read : వెస్టిండీస్ క్రికెటర్ కు ఐసీసీ షాక్.. ఆరేళ్ల పాటు నిషేధం అసలు విషయానికొస్తే.. సమంత కొన్నాళ్ల క్రితం ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యం అందజేస్తుంది. ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారులకు చికిత్స అందేలా చూసుకుంటూ కొన్ని రకాల ప్రాణాపాయ వ్యాధులకు కూడా చికిత్స అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడేందకు తనవంతు సహాయం చేస్తుంది. అంతేకాదు చాలా చాలా ఖర్చుతో కూడిన వ్యాధులకు కూడా వైద్యం అందిస్తున్న సమంత ఎంతోమంది మన్ననలు పొందుతుంది. దాదాపు 11 ఏళ్లుగా ఈ సంస్థను నడుపుతుండగా ఇది మహిళలు, బాలబాలికల సంక్షేమం కోసం పనిచేస్తుంది. అయితే ఇప్పటికే ఎందరో చిన్నారులకు అండగా నిలబడిన సమంత ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలో ఇద్దరు చిన్నారలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలన చూసుకునే బాధ్యతను తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీయదు. దీనిపై క్లారిటీ రావాలంటే సమంత లేదా ఆమె టీమ్ స్పందించాలి. #samantha #two-children #adopt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి