Salman Khan House Firing: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..రూ. 4లక్షల సుపారీ..!

New Update
Salman khan : కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్

Salman Khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల కేసులో ప్రమేయం మరో అనుమానితుడ్ని పోలీసులు బుధవారం రాత్రి హర్యానాలో అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. పోలీసులకు పట్టుబడిన వ్యక్తి లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కి, పోలీసుల అదుపులో ఉన్న షూటర్లు విక్కీ గుప్తా, సాగర్‌ కుమార్‌ లకు మధ్యవర్తిగా పని చేసినట్లు అధికారులు గుర్తించారు.

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సూచనల మేరకు గత ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ముంబైలోని సల్మాన్‌ ఖాన్‌ గెలాక్సీ అపార్ట్‌ మెంట్‌ బయట మోటార్‌ సైకిల్‌ పై వచ్చిన విక్కీ గుప్తా, సాగర్‌ కుమార్‌ ఐదు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇద్దరు వ్యక్తుల్లో సాగర్‌ కుమార్‌ ఏప్రిల్‌ 13 బాంద్రా ప్రాంతం నుంచి తుపాకీ ని అందుకున్నట్లు సమాచారం. అయితే నిందితుడికి ఆయుదాన్ని సరఫరా చేసింది ఎవరూ అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

నిందితులు ఇద్దరూ బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరిని సోమవారం అర్థరాత్రి గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ఆలయ ప్రాంగణంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్‌, అతని అనుచరుడు విక్కీ గుప్తా ఇద్దరికీ కూడా కాల్పులు జరపడానికి రూ. 4 లక్షల సుపారీ ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ముందుగా వీరికి లక్ష రూపాయలను అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అయితే నిందితులు ఇద్దరు కూడా సల్మాన్‌ ఖాన్‌ ని చంపడం వారి లక్ష్యం కాదు..కేవలం కాల్పులు జరిపి భయపెట్టాలని వారికి ఆదేశాలు వచ్చినట్లు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు తెలిపారు. నిందితులు పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో 'రెక్కీ ' నిర్వహించారు. వారు అతనిని భయపెట్టాలని భావించారు. అంతేకానీ హత్య చేయలని అనుకోలేదని అధికారులు వివరించారు.

నిందితుల కుటుంబాల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కోసం సుమారు 7 గురిని హర్యానా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించినట్లు అధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతున్నట్లు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి పేర్కొన్నారు.

ఈ కేసు కు సంబంధించి సల్మాన్‌ ఖాన్‌ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసేందుకు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సల్మాన్‌ ఖాన్‌ సమావేశమయ్యారు. ఆయన అండగా ఉంటామని సల్మాన్‌ కు హామీ ఇచ్చారు.

Also read: ఎన్నికల పోటీ నుంచి తప్పించుకున్న గులాం నబీ ఆజాద్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు