TGSRTC : ముందు ఉంది.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సజ్జనార్ స్వీట్ వార్నింగ్!

TG: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీజీఏస్ ఆర్టీసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్‌ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉందని తెలిపింది.

New Update
TGSRTC : ముందు ఉంది.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సజ్జనార్ స్వీట్ వార్నింగ్!

TGSRTC MD Sajjanar : బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) కి టీజీఏస్ ఆర్టీసీ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొంది. హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా తెలిపింది.

"నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు బస్‌ స్టేషన్‌ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. TGSRTC కి పెండింగ్‌లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆదేశించింది.

హైకోర్టు (High Court) ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్‌ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్ లోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మాల్ ను స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆ షాపింగ్‌ మాల్ లోని సబ్‌ లీజ్‌ దారుల ప్రయోజనం దృష్ట్యా మాల్‌ను ఓపెన్‌ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు సబ్‌ లీజ్‌ దారులను దృష్టిలో ఉంచుకుని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం సంస్థ అనుమతి ఇచ్చింది. వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సంస్థ నడుచుకుంటుంది." అని ప్రకటన విడుదల చేసింది.

Also Read : 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్‌ విడుదల.. సెలవులు, పరీక్షలు ఎప్పుడంటే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hrithik Roshan Krrish 4: ఇదో కొత్త ప్రపంచం, మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది: హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ తన డైరెక్షన్ డెబ్యూట్‌గా 'క్రిష్ 4'ను తెరకెక్కించబోతున్నారు. దర్శకుడిగా మారడం తనకు కొత్తగా, సవాళ్లతో కూడినదిగా అనిపిస్తుందని చెప్పారు. హృతిక్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో అనేక మంది బాలీవుడ్ స్టార్‌లు ఉన్నారు.

New Update
Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4

Hrithik Roshan Krrish 4: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఇప్పటివరకు హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆయన ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌కి రెడీ అవుతున్నారు. అవును, హృతిక్ రోషన్ తొలిసారి దర్శకుడిగా మారనున్నట్టు ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కబోయే తొలి చిత్రం ‘క్రిష్ 4’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో హృతిక్ ఈ ప్రయాణంపై తన భావాలను షేర్ చేసుకున్నారు. “దర్శకుడిగా మారడం నాకు సంతోషకరం అయినప్పటికీ, కొంత భయం కూడా కలుగుతోంది. ఇది పూర్తిగా కొత్త ప్రపంచం. మళ్లీ స్కూల్‌కు వెళ్లినట్లు అనిపిస్తోంది. ఒక దర్శకుడిగా అనేక విషయాల్లో నైపుణ్యం అవసరం, భారీగా పరిశోధనలు చేయాలి. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో, 'ఇది ఎందుకు ఎంచుకున్నానా?' అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయినా, వాటన్నింటికీ సిద్ధంగా ఉన్నాను,” అంటూ తన డైరెక్షన్ జర్నీపై హృతిక్ ఓపెన్ అయ్యారు.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

హృతిక్‌ త్రిపాత్రాభినయంలో..!

‘క్రిష్ 4’ అనగానే ఫ్యాన్స్‌లో ఎనలేని క్రేజ్ మొదలైంది. అందుకు కారణం, హృతిక్‌ ఇందులో త్రిపాత్రాభినయంలో కనిపించనున్నారని వినిపిస్తున్న వార్తలు. హీరోగా మాత్రమే కాకుండా, విలన్ పాత్రలో కూడా కనిపించబోతున్నారని టాక్. ఇక ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ టాప్ నటీనటులు కూడా భాగం కానున్నారు. ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, రేఖ లాంటి ప్రముఖులు ఇందులో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే గ్లామర్ క్వీన్ నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

ఈ విధంగా క్రిష్ 4 సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా హృతిక్ కొత్త ఛాప్టర్ మొదలుపెట్టబోతున్నారు. ఆయన తీసుకున్న ఈ క్రియేటివ్ రిస్క్ బాలీవుడ్‌లో మరో సెన్సేషన్‌ను సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు