Sajjala Comments: చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల సంచలన వాఖ్యలు.. ఆ విషయంలో టీడీపీ సక్సెస్ అంటూ ధ్వజం చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న వార్తలు, టీడీపీ నేతల ఆరోపణలపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. రిమాండ్ లో ఉన్న ఖైదీ హెల్త్ రిపోర్ట్స్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సంపాదన కోసమే చంద్రబాబు సీఎం అయ్యారంటూ తీవ్ర వాఖ్యలు చేశారు సజ్జల. By Nikhil 18 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Sajjala Comments on Chandrababu: చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వస్తున్న వార్తలు, ఏసీబీ కోర్టులో (ACB Court) ఆయన కుటుంబ సభ్యుల పిటిషన్ తదితర పరిణామాలపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) స్పందించారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. రిమాండ్ లో ఉన్న ఖైదీ హెల్త్ రిపోర్ట్స్ రోజూ ఎందుకు ఇస్తారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు కు (Chandrababu Naidu) ప్రతీ రోజూ చెకప్ చేసి రిపోర్ట్స్ కోర్టుకు పంపిస్తున్నారన్నారు. చంద్రబాబు ను ఆయన కుటుంబసభ్యులే బట్టలిప్పి బయట నిలబెడుతున్నారని తీవ్ర వాఖ్యలు చేశారు. సాధారణ ప్రజాజీవితానికి ఇబ్బంది కలిగేలా టీడీపీ నేతలు (TDP Leaders) వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జరిగిన అవినీతిపై చర్చ లేకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది కూడా చదవండి: Watch Video: ‘ఏయ్.. భూమి రాసిస్తావా? చంపేయమంటావా?’.. మంత్రి అనుచరుడి బెదిరింపులు.. ఈ విషయంలో టీడీపీ కాస్త సక్సెస్ అయినట్లు కనిపిస్తోందన్నారు. సంపాదించడం కోసమే సీఎం అయినట్లు చంద్రబాబు వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.240 కోట్లను షెల్ కంపెనీకి తరలించి.. అక్కడి నుంచి చంద్రబాబు తనకు మళ్లించుకున్నాడంటూ ధ్వజమెత్తారు. ఇది కూడా చదవండి: Nara Lokesh: చంద్రబాబుతో ములాఖత్ కోసం ఢిల్లీ నుంచి రాజమండ్రికి లోకేష్.. టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పాత్ర నేరుగా ఉందని ఆధారాలతో సహా ఉందని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ వస్తే అంతా బయట పడుతుందన్నారు. చంద్రబాబు ను అక్రమంగా ఇరికించలేదని మరో సారి తేల్చి చెప్పారు. తప్పు చేసినట్లు కోర్టు నమ్మినందునే చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీకి పంపించారని సజ్జల అన్నారు. #ap-politics #chandrababu-arrest #sajjala-ramakrishna-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి