Andhra Pradesh: పోలింగ్ తర్వాత సజ్జల రామకృష్ణ ఏమన్నారంటే.. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఎంతో సానుకూలత ఉందని.. మహిళల ఆశీస్సులు అధికంగా ఉన్నాయన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. By B Aravind 14 May 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 6 గంటలకు 68.12 శాతం పోలింగ్ నమోదైంది. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు ఓటింగ్ సాగింది. దీంతో 80 శాతం పోలింగ్ నమోదుకావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ అనంతరం వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఎంతో సానుకూలత ఉందని.. మహిళల ఆశీస్సులు అధికంగా తమ పార్టీకి ఉన్నాయని అన్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. Also Read: కాబోయే ప్రధాని ఆయనే.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు! మాచర్ల, టెక్కలి, వేమూరు, గుంటూరు వెస్ట్, అద్దంకి, పొన్నూరు, అమలాపురం, వినుకొండ, సత్తెనపల్లి లో కూటమి నేతలు రిగ్గింగ్ కూ పాల్పడ్డారని. ఇలాంటి ఘటనలపై ఎన్నికల అధికారులకు మొత్తం 80 పైగా ఫిర్యాదులు చేశామని పేర్కొన్నారు. Also Read: హిజాబ్, బుర్కా తెలుసు.. మరి నిఖాబ్ మతలబేంటి!? #telugu-news #ap-politics #ysrcp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి