/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-76.jpg)
S S Thaman Gives A New Update On Pawan Kalyan's OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో 'ఓజీ' (OG) ఒకటి. సాహూ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి.
గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్.. ప్రస్తుతం ఎన్నికల (Elections) సందర్భంగా కొన్ని రోజులు వాయిదా పడింది. త్వరలోనే షూటింగ్ పునఃప్రారంభం కానుంది. కాగా ఈ సినిమా కొత్త అప్‌డేట్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్త బయటికొచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి సంబంధించి గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చాడు.
Also Read : తెలుగు సినిమా నాకెంతో ప్రత్యేకం.. టాలీవుడ్ పై ప్రేమ కురిపించిన బాలీవుడ్ బుట్టబొమ్మ!
బ్లాస్ట్ ఆన్ ది వే...
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా తన ఇన్ స్టా స్టోరీస్ లో 'OG' బ్లాస్ట్ రాబోతుందని చెబుతూ ఓ సౌండ్ స్పీకర్ ఫోటోను పంచుకున్నాడు. ఇదే స్టోరీని స్క్రీన్ షాట్ తీసిన OG నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్స్ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.."ఓజీ మిషన్‌లో ఉన్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే.. అంటూ మ్యూజికల్ అప్‌డేట్ (Musical Update) ఇచ్చి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. ఈ అప్డేట్ తో అప్పుడే సోషల్ మీడియాలో 'OG' సాంగ్స్ గురించి డిస్కషన్స్ స్టార్ట్ అయిపోయాయి.
THE MAN is on a mission 😁🔥#TheyCallHimOG #OG @MusicThaman pic.twitter.com/Q2yICvolaR
— DVV Entertainment (@DVVMovies) June 17, 2024