Russia : మోదీకి శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు!

వరుసగా భారత ప్రధానిగా మూడోసారి పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నేతల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.. తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోదీకి ఫోన్‌ చేసి శుభాభినందనలు తెలిపారు

New Update
PM Modi: ప్రధాని మోదీ పర్యటన.. రష్యా సంచలన నిర్ణయం

PM Modi : వరుసగా భారత ప్రధానిగా మూడోసారి పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీ (Narendra Modi) కి ప్రపంచ దేశాల నేతల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.. తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మోదీకి ఫోన్‌ చేసి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పుతిన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు.

"రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశ ప్రజలు రికార్డు స్థాయిలో సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) పాలుపంచుకోవడం పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీయే విజయాన్ని అభినందించారు. భారత్-రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఇరుదేశాల నిబద్ధతను ఉద్ఘాటించాం" అని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Also read: మా విలువైన భాగస్వాములను కలిశామన్న మోదీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment