Russia: రష్యా జైలులో ఐసీస్ ఉగ్రవాదుల కలకలం.. రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్‌లో కొంతమంది విచారణ ఖైదీలు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని నిర్బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని బంధించిన ఖైదీల్లో కొందరికి కాల్చి చంపి జైలు సిబ్బందిని రక్షించారు. By B Aravind 16 Jun 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్‌లో కొంతమంది విచారణ ఖైదీలు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని బంధించిన ఖైదీల్లో కొందరికి కాల్చి చంపేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రోస్తోవ్-ఆన్-డాన్ అనే నగరంలో ఉన్న ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్‌లో ఆరుగురు ఖైదీలను ఇద్దురు జైలు సిబ్బంది బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే వాళ్ల దగ్గర మరణాయుధాలు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. Also Read: అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరు దుర్మరణం అయితే ఒక్కసారిగా జైలు సిబ్బందినే ఆ ఖైదీలు నిర్భందించారు. దీంతో రష్యా బలగాలు వారిపై కాల్పులు జరిపి.. ఇద్దరు సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు రష్యా మీడియా తెలిపింది. అయితే ఈ ఘటనలో ఎంతమంది ఖైదీలు మృతి చెందారనేదానిపై స్పష్టత లేదు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ హాల్‌పై ఐసిస్ ఉగ్రవాదులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో మొత్తం 145 మంది ప్రాణాలు కోల్పోయారు. Also read: ఢిల్లీలో నీటి సంక్షోభం.. అల్లాడిపోతున్న నగర ప్రజలు #telugu-news #russia #isis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి