Russia-Ukraine War: పుతిన్ సంచలన ప్రకటన.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మాస్కో-కీవ్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలవని పుతిన్ చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. By srinivas 05 Sep 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమని పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాలు మాస్కో-కీవ్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలవని పుతిన్ చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.. ఈ సందర్భంగా యుద్ధం మొదలైన మొదటి వారంలోనే తుర్కియేలోని ఇస్తాంబుల్ చర్చల్లో భాగంగా కుదిరిన ఒప్పందాన్ని ఉక్రెయిన్ అమల్లోకి తీసుకురాలేదని ఈ సందర్భంగా పుతిన్ గుర్తు చేశారు. ఆ ఒప్పందం ఆధారంగానే భవిష్యత్తులో శాంతి చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. 'మేము ఉక్రెయిన్‌తో చర్చలకు రెడీగా ఉన్నాం. శాంతి చర్చలను ఎప్పుడూ తిరస్కరించలేదు. ఇస్తాంబుల్ చర్చల్లో ఉక్రెయిన్ ఒప్పందంపై సంతకం చేసింది. అమెరికా, ఐరోపా ఒత్తిడి కారణంగా అమలు పరచలేదు. రష్యాను ఓడించాలని ఐరోపాదేశాలు భావిస్తున్నాయి’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పుతిన్. ఇది కూడా చదవండి: Ambulance Rape: అంబులెన్స్‌లో ఘోరం.. పేషెంట్ భార్యపై డ్రైవర్ లైంగిక దాడి! ఇక ఈ శాంతి ప్రక్రియలో భారత్ కీలకమని రష్యా అధికారులు తెలిపారు. మోదీ-పుతిన్ మధ్య మంచి సంబంధాలున్నాయని, దీనిని వినియోగించుకొని మోదీ శాంతికి బాటలు వేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. #russia-ukraine-war #russia-putin #ukraine-zelenskyy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి