BRS-Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ ఆర్మూర్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన షాపింగ్ మాల్ అద్దె రూ.3 కోట్లను సాయంత్రంలోగా చెల్లించాలని స్పష్టం చేశారు. లేకుంటే మాల్ ను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. By Nikhil 09 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Armur Ex MLA : బీఆర్ఎస్(BRS) నేత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) కి ఆర్టీసీ(RTC) అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ కు సంబంధించి ఆర్టీసీ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ విశ్వజిత్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్(Vishwajit Infrastructure Pvt Ltd) సంస్థకు నోటీసులు ఇచ్చిన స్పందించడం లేదని అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ లీజు స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ అద్దె బకాయిలను గడువు లోగా చెల్లించనందున హైకోర్టు ఉత్తర్వులు మేరకు సీజ్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు ఆర్టీసీ అధికారులు. సాయంత్రం వరకు డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రంలోగా రూ.3.14 కోట్ల బకాయిలు చెల్లించకుంటే కాంప్లెక్స్ సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. షాపింగ్ మాల్ లో ఉన్న అద్దె దారులు ఆర్టీసీ మైక్ అనౌన్స్మెంట్ గమనించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సాయంత్రం జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ ను ఆర్టీసీ అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఘటనపై జీవన్ రెడ్డి ఇంకా రియాక్ట్ కాలేదు. ఆయన ఎలా స్పందిస్తారన్న అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. Also Read : టీడీపీ నేత ఇంట్లో భారీగా సొమ్ము స్వాధీనం.. అధికారి లెక్కలపై అనుమానాలు..! #brs #tsrtc #jeevan-reddy #armur-ex-mla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి