TSRTC: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్?.. క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్!

జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యాజమాన్య సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన ఆర్జీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె లేదని స్పష్టం చేశారు. అద్దెబస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు.

New Update
TSRTC: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్?.. క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్!

TSRTC: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ టికెట్ అమల్లోకి తెచ్చినప్పటినుంచి ఏదో ఒక ఇష్యూ, సంచలనాలతో ఆర్టీసీ ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. అంతేకాదు ఫ్రీ టికెట్ ఎఫెక్ట్ కారణంగా తెలంగాణ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (Road Transport Corporation) అధికారులు తమ సంస్థలో పలు సవరణలు చేపట్టారు. ఇటీవలే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (MD Sajjanar) టీ 24 టికెట్లను పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అద్దె బస్సుల వ్యవహారం చర్చనీయాంశమైంది. జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యాజమాన్య సంఘం ఇప్పటికే ప్రకటించగా దీనిపై సజ్జనార్ స్పందించారు.

ఈ మేరకు ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. బస్ భవన్ (Bus bhavan) లో ఈ రోజు జరిపిన చర్చలు సఫల మయ్యాయని, అద్దెబస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. దీని కోసం ఒక కమిటీని వేస్తాం. జనవరి 5 నుంచి యధావిధిగా అద్దెబస్సులు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి సమ్మె ఉండదన్నారు. అలాగే తెలంగాణలో ప్రస్తుతం 2700 అద్దెబస్సులు రన్ చేస్తున్నమని, సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందన్న ఆయన.. పండగ సందర్భంగా స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Kishan reddy: బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికల్లో ఓటేస్తే చెత్త కుప్పలో వేసినట్లే.. అదో ఔట్ డేటెడ్ పార్టీ: కిషన్ రెడ్డి

ఇక అద్దె బస్సుల యాజమాన్య సంఘం అధ్యక్షుడు మధుకర్ రెడ్డి (Madhukar reddy)మాట్లాడుతూ.. 5 సమస్యలను సజ్జనార్ కు విన్నవించాం. తమ సమస్యలను జనవరి 10 లోపు పరిష్కరిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. దీంతో జనవరి 5న తలపెట్టిన సమ్మె విరమిస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ తో ప్రయాణికుల రద్దీ పెరిగిందని దీంతో బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అద్దె బస్సుల యజమానులు, బస్సులు పాడై రద్దీ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఈ సమ్మెకు దిగబోతున్నట్లు ప్రకటించినప్పటికీ సజ్జనార్ ఇందుకు సంబంధించిన పూర్తి బాధ్యతలు తీసుకుని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు మధుకర్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు