Mohan Bhagwat: ఇక దేశనిర్మాణంపై దృష్టి పెట్టండి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై తొలిసారిగా మాట్లాడారు. నాగ్ పూర్ లో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయాయి.. ఇక దేశనిర్మాణంపై దృష్టి పెట్టండి అని సూచించారు. ఎన్నికలు అంటే యుద్ధం కాదు పోటీ అని ఆయన చెప్పారు. 

New Update
Mohan Bhagwat: ఇక దేశనిర్మాణంపై దృష్టి పెట్టండి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Mohan Bhagwat: ఎన్నికలు ముగిశాయని, ఇప్పుడు దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. లోక్‌సభ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై ఆయన మొదటిసారిగా స్పందించారుఎన్నికలంటే పోటీ మాత్రమే ననీ.. యుద్ధం కాదనీ ఆయన చెప్పారు. ఎన్నికలనేవి ఏకాభిప్రాయ ప్రక్రియ అన్నారు. ప్రతి సమస్యకు రెండు కోణాలు ఉంటాయి.. ఏ సమస్యనైనా పార్లమెంట్ లో రెండు కోణాల్లోనూ పరిశీలించాలని సూచించారు. ప్రతి అంశానికి రెండు వైపులా ఆలోచించాలని, ఒక పార్టీ ఒకవైపు ప్రస్తావిస్తే, ప్రతిపక్షం మరో వైపు ప్రస్తావన తేవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ ద్వారానే సరైన నిర్ణయానికి రాగలమని భగవత్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రాధాన్యతను ఆయన ఎత్తిచూపారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన భగవత్ ఈ కోణంలో కొత్త ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు సలహాలు ఇచ్చారు.

Mohan Bhagwat: ప్రతి ఐదేళ్లకోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది, అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు? కారణాలేంటి? ఈ అంశాలు ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించినవి కావని భగవత్ వ్యాఖ్యానించారు. "ప్రతి ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని బాగా అర్థం చేసుకునేందుకు సంఘ్ పని చేస్తుంది. ఈసారి కూడా అదే చేసింది. ఎన్నికల ఫలితాల విశ్లేషణ ఆగలేదు. నాయకులను ఎందుకు ఎన్నుకోవాలి? పార్లమెంటుకు ఆమోదించడానికి వివిధ అంశాలపై ఏకాభిప్రాయం ఎంపిక చేయబడింది. ఏకాభిప్రాయం మన సంప్రదాయం. ఆ దిశగా పురోగతి ఉంది ఎన్నికల ప్రక్రియ యుద్ధం కాదు, కేవలం పోటీ మాత్రమే' అని మోహన్ భగవత్ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ తప్పదన్నారు. ఈ సమయంలో, ఇతరులను వెనక్కి నెట్టడం కూడా జరుగుతుంది, అయితే దీనికి పరిమితి ఉంది. ఈ పోటీ అబద్ధాల ఆధారంగా ఉండకూడదని చెప్పారు. 

Also Read: టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు

Mohan Bhagwat: మణిపూర్ పరిస్థితిపై భగవత్ మాట్లాడుతూ ఏడాది కాలంగా శాంతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా శాంతిభద్రతలు ఉండగా, ఒక్కసారిగా అక్కడ తుపాకీ సంస్కృతి పెరిగిపోయింది. ఈ సమస్యను ప్రాధాన్యతపై పరిష్కరించడం ముఖ్యం అని ఆయన సూచించారు. 

“ప్రవక్త ఇస్లాం అంటే ఏమిటో మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు క్రైస్తవ మతం ఏమిటో మనం ఆలోచించాలి. దేవుడు అందరినీ సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన విశ్వం పట్ల మన భావాలు ఎలా ఉండాలో మనం ఆలోచించాలి.” అంటూ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు