BSP: మాయవతి ట్వీట్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ..అవన్నీ తప్పుడు ఊహాగానాలే.! బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి చేసిన ట్వీట్ ను అర్థం చేసుకోకుండా కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. యూపీలో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. By Bhoomi 10 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి BSP: బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి చేసిన ట్వీట్ ను అర్థం చేసుకోకుండా కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి గారు చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది రకరకాల తప్పుడు ఊహాగానాలు చేస్తున్నారన్నారు. గతంలో అనేక సార్లు మాయావతి మేము ఏ జాతీయ పార్టీలతో కానీ, ఎన్డీయే, ఇండియా కూటములతో కానీ పొత్తుపెట్టుకోమని చాలా స్పష్టంగా చెప్పారు. వారు ఈ రోజు కూడా ‘తృతీయ ఫ్రంట్’ అని మీడియాలో వస్తున్న అసత్య కథనాల మీద అలాంటిదేం లేదని వివరణ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ లో కూడా ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అంతే తప్ప వారు ఏ కూటమి లో లేని ప్రాంతీయ పార్టీలతో కలసి పనిచేయడం గురించి ప్రస్తావించలేదు. దయచేసి గమనించగలరని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయవతి గారు చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా చాలా మంది రకరకాల తప్పుడు ఊహాగానాలు చేస్తున్నారు. గతంలో అనేక సార్లు బెహెంజి మాయావతి గారు మేము ఏ జాతీయ పార్టీలతో కానీ, ఎన్డీయే, ఇండియా కూటములతో కానీ పొత్తుపెట్టుకోమని చాలా… — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 9, 2024 గతంలో మధ్య ప్రదేశ్, పంజాబ్ లలో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో జరిగినట్లుగానే తెలంగాణ లో కూడా రాబోయే పార్లమెంటు ఎన్నికల సంభందించి ఇటీవల బీఎస్పీ, ప్రాంతీయ పార్టీ అయన బిఆర్ఎస్ తో పొత్తు కోసం జరిగిన చర్చలకు బీయస్పీ హైకమాండ్ అనుమతి ఉంది. సీట్ల పంపకం పై స్పష్టత వచ్చే దాకా చర్చలు కొనసాగుతూనే ఉంటాయి. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. అసత్య ప్రచారాలను ఆపండి అంటూ ట్వీట్ చేశారు. ఇది కూడా చదవండి: 50ఏళ్ల తర్వాత కూడా ఫిట్‌గా ఉండాలంటే ఈ యోగా చేయాల్సిందే..!! #bsp #rs-praveen-kumar #mayavathi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి