TS: బీఆర్ఎస్ లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్! మాజీ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ ఛీఫ్ ఆర్ఎ.స్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసిన ఆయన ఈ రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎర్రవెల్లి ఫౌమ్ హౌజ్ వేదికగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు తెలిపారు. By srinivas 18 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Breaking: మాజీ ఐపీఎస్, తెలంగాణ బీఎస్పీ మాజీ ఛీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసిన ఆయన ఈ రోజు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మాయవతి తిరస్కరణ.. ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించాడు ప్రవీణ్. కానీ దీనికి బీఎస్పీ చీఫ్ మాయవతి అంగీకరించకపోవడంతో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు ప్రవీణ్. ఈ క్రమంలోనే తను బీఎస్పీకీ రాజీనామా చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే తన అభిమానులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: Kavitha: రూ.100 కోట్ల చెల్లింపుల్లో కవితది కీలక పాత్ర.. ఈడీ సంచలన ప్రకటన! ఎంపీగా పోటీ.. ఈ క్రమంలోనే ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లిన ఆయన.. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రవీణ్ ఆ స్థానం నుంచి పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరగుతోంది. #brs #kcr #rs-praveen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి