Bus stop chori: అసెంబ్లీకి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ చోరీ..ఎలా ఎత్తుకెళ్లారో తెలుసా? By Bhavana 05 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి దొంగతనం అంటే సాధారణంగా బంగారం, నగలు, డబ్బులు, వాహనాలు, కోళ్లు, గేదెలు ఇలా మొదలైన వాటిని ఎత్తుకుపోతుంటారు. కానీ ఇక్కడి దొంగలు ఏకంగా బస్ స్టాప్ నే ఎత్తుకుపోయారు. అవును మీరు విన్నది నిజమే..పది లక్షలు విలువైన బస్ స్టాప్ దొంగతనం చేశారు ఈ ఘరానా దొంగలు. ఇది ఎక్కడో జరగలేదు.. కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు (bengaluru) నగరంలో బీఎంటీసీ ఏర్పాటు చేసిన బస్ స్టాప్(Bus stop) దొంగతనానికి గురైంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే..ఈ బస్ స్టాప్ అసెంబ్లీకి కేవలం కిలో మీటర్ దూరంలోనే ఉంది. స్టెయిన్ లెస్ స్టీల్ తో చేసిన ఈ బస్ స్టాప్ కి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అయ్యింది. Also read: ఆ చిట్ కంపెనీల్లో నోట్ల కట్టలు.. ఐటీ దాడుల్లో సంచలనాలు..! నిత్యం ఎంతో రద్దీగా ఉండే కన్నింగ్ హోమ్ లో ఈ బస్ షెల్టర్ ని వారం రోజుల కిందటే ఏర్పాటు చేశారని..అంతలోనే ఇది చోరీకి గురైందని బస్ స్టాప్ ని నిర్మించిన సంస్థ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. అక్కడ బస్ స్టాప్ ని నిర్మించే పని ఓ ప్రవైట్ కంపెనీకి అప్పగించింది. ఆ కంపెనీ అధికారి రెడ్డి మాట్లాడుతూ..బస్ స్టాప్ ని ఎత్తుకుపోయినట్లు పోలీసు అధికారులకు ఈ నెల 30 నే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. బస్ స్టాప్ స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేసినట్లు ఆయన వివరించారు. ఆగస్టు 21న దీనిని ఏర్పాటు చేస్తే..28 న అక్కడ బస్ షెల్టర్ లేదని..అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు. పోలీసు అధికారులు ఐపీసీ సెక్షన్ 279 (దొంగతనం) కింద పోలీసులు కేసు నమోదు చేశారని" తెలిపారు. #bengaluru #karnataka #busstop మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి