RRR Tax: తెలంగాణలో RR ట్యాక్స్ కాదు RRR ట్యాక్స్ నడుస్తోంది.. మోదీ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో RR ట్యాక్స్‌పై చర్చ జరుగుతోందని అన్నారు మోదీ. RR ట్యాక్స్ పై తాను ఎవరు పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. RR కాదు RRR ట్యాక్స్ నడుస్తోందని.. మూడో R అంటే రజాకార్ ట్యాక్స్ అని పేర్కొన్నారు.

New Update
RRR Tax: తెలంగాణలో RR ట్యాక్స్ కాదు RRR ట్యాక్స్ నడుస్తోంది.. మోదీ కీలక వ్యాఖ్యలు

RRR Tax : గత పదేళ్లలో తెలంగాణ(Telangana) రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులన్నీ అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం దోచుకుంటున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌(BRS) సర్కారు.. కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌ దారిలోనే వెళ్తోందని ని విమర్శించారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోందని దుయ్యబట్టారు. తాను ఎవరి పేరూ చెప్పకపోయినప్పటికీ.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారని, దీనిని బట్టి ఆ ట్యాక్స్‌ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేట, హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు.

ALSO READ: సీఎం రేవంత్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

‘నా పాలమూరు సోదర, సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు. జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నా’ అంటూ తెలుగులో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నో కష్టాలకు ఓర్చి తనను ఆశీర్వదించేందుకు వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ మోదీ గ్యారంటీ అంటే.. దేశ అభివృద్ధికి గ్యారంటీ, విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, ఇచ్చిన హామీలు నెరవేరతాయన్న గ్యారంటీ. మహబూబ్‌నగర్‌ ప్రాంతాన్ని భారాస, కాంగ్రెస్‌ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి.

కాంగ్రెస్‌ రాకుమారుడు ఎన్నికలు(Elections) రాగానే విద్వేష విషం చిమ్ముతున్నారు. ఆయన రాజగురువు మనల్ని రంగు ఆధారంగా విభజిస్తున్నారు. శరీర రంగును బట్టి దక్షిణ భారత్‌ వాళ్లు ఆఫ్రికన్లు అని మాట్లాడారు. కాంగ్రెస్‌కు హిందువులు, వారి పండుగలు అంటే ఇష్టం లేదు. హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని కాంగ్రెస్‌ చూస్తోంది. కులాలు, మతాల పేరిట దేశాన్ని విభజించాలని కాంగ్రెస్‌ చూస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను అంబేడ్కర్‌ కూడా వ్యతిరేకించారు. అలాంటి రిజర్వేషన్లు ఇస్తే.. మతమార్పిడులు పెరుగుతాయి. కాంగ్రెస్‌ అంటే అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయి’’ అని మోదీ విమర్శించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు