Metro: మెట్రో ఫేజ్‌-2 విస్తరణ రూట్‌మ్యాప్‌ విడుదల

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌మ్యాప్‌ ఫిక్స్ అయింది. సీఎం రేవంత్‌ ఆదేశాలతో ఫేజ్‌-2 రూట్‌మ్యాప్‌ను అధికారులు ఎట్టకేలకు రెడీ చేశారు. 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతిపాదించారు.

New Update
Metro: మెట్రో ఫేజ్‌-2 విస్తరణ రూట్‌మ్యాప్‌ విడుదల

Hyderabad Metro Phase 2: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణకు రూట్‌మ్యాప్‌ ఫిక్స్ అయింది. సీఎం రేవంత్‌ ఆదేశాలతో ఫేజ్‌-2 రూట్‌మ్యాప్‌ను అధికారులు ఎట్టకేలకు రెడీ చేశారు. 70 కిలోమీటర్ల కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా అధికారులు ప్రతిపాదించారు. ఫేజ్‌-2 విస్తరణలో భాగంగా చాంద్రయాణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు పొడిగించారు.

నాలుగు కారిడార్లలో..
ఈ మేరకు జేబీఎస్‌ (JBS) నుంచి ఎంజీబీఎస్‌ (MGBS) ఉన్న రెండో కారిడార్‌ చాంద్రయాణగుట్ట వరకు పొడిగిస్తూ ప్రతిపాదించారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కారిడార్‌-2లో ఎంజీబీఎస్‌ మెట్రోస్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా (FalaknumaMGB) వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్‌నుమా నుంచి చాంద్రయాణగుట్ట క్రాస్‌ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లు నిర్మించనున్నారు. కారిడార్‌-4లో నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 29 కిలోమీటర్లు వేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Cook: అదే మా కొంపముంచేలా ఉంది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

మైలార్‌దేవ్‌పల్లి-ఎయిర్‌పోర్ట్‌..
అలాగే నాగోల్‌, ఎల్‌బీనగర్‌, చాంద్రయాణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో వెళ్లేలా ప్రతిపాదించారు. ఇదే కారిడార్‌-4లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలోమీటర్లు, కారియర్‌-5లో రాయదుర్గం నుంచి అమెరికన్‌ కాన్సులేట్‌ వరకు 8 కిలోమీటర్లు.. రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ, విప్రో జంక్షన్‌ నుంచి ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు మెట్రో లైన్ వేసేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.

ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌..
కారిడార్‌-6లో మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్ల, మియాపూర్‌, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రో లైన్‌ వేయాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. కారిడార్‌-7లో ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు 8 కిలోమీటర్ల వరకు.. ఎల్‌బీనగర్‌, వనస్థలీపురం, హయత్‌నగర్‌ వరకు మెట్రో వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు