Kiran Royal: రోజా భాగోతం బయటపెడుతాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజాపై తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంచార్జి కిరణ్‌ రాయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా గ్లిజరిన్‌ పూసుకొని ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. తన మనోభావాలు దెబ్బతిన్నాయని వెక్కి వెక్కి ఏడ్చిన రోజాకు పవన్‌ కళ్యాణ్‌ కుటుంబాన్ని విమర్శించిన సమయంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలియలేదా అని ప్రశ్నించారు.

New Update
Kiran Royal: రోజా భాగోతం బయటపెడుతాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజాపై తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంచార్జి కిరణ్‌ రాయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా గ్లిజరిన్‌ పూసుకొని ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. తన మనోభావాలు దెబ్బతిన్నాయని వెక్కి వెక్కి ఏడ్చిన రోజాకు పవన్‌ కళ్యాణ్‌ కుటుంబాన్ని విమర్శించిన సమయంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలియలేదా అని ప్రశ్నించారు. రోజాను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే రోజాకు నిజమైన ఏడుపులు చూపిస్తామని జనసేన నేత హెచ్చరించారు.

మరోవైపు రోజాకు మాజీ మంత్రి బండారు సత్య నారాయణ గురించి ఎందుకని కిరణ్‌ ప్రశ్నించారు. రోజా భాగోతం ఏదో ఉంది కాబట్టే ఆమె భయపడుతోందని జనసేన నేత అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి రోజా ఏడుస్తోందని ప్రజలు టపాసులు కాల్చుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారన్న ఆయన.. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక రోజాను మూడు సంవత్సరాలు జైల్లో కూర్చోబెడుతామన్నారు. మరోవైపు జోగి రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేత.. జోగి రమేష్‌ సీఎం సంక నాకుతూ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు.

జోగి రమేష్‌ ప్రజలకు అందాల్సిన చెక్కెర, బియ్యం, జీడిపప్పుతో సీఎం జగన్‌ వద్దకు వెళ్లుతున్నాడని ఎద్దేవా చేశారు. జోగి రమేష్‌ పెనడలో జనసేన నిర్వహించనున్న వారాహి యాత్ర అడ్డుకుంటానని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారిహి యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంచార్జి కిరణ్‌ రాయల్‌ హెచ్చరించారు. జోగి రమేష్‌ గూర్జా మంత్రి అన్న ఆయన.. ఈ మంత్రిని మళ్లీ నేపాల్‌ పంపిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ వైసీపీ నాయకుడని, అతడికి టీడీపీ-జనసేన పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.

Advertisment
Advertisment
Advertisment