Rohit Sharma: కొహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన హిట్‌మ్యాన్..

స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారిగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకింగ్స్‌లో అధిగమించాడు. ఇక తొలి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఉండగా... రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మూడో స్థానంలో నిలిచాడు.

New Update
Rohit Sharma: కొహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ.. ఐసీసీ ర్యాకింగ్స్‌లో సత్తా చాటిన హిట్‌మ్యాన్..

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ దుమ్మురేపుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి ర్యాంకింగ్స్‌లో తన సత్తా చాటాడు. బుధవారం విడుదల చేసిన తాజా వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్‎లో ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి జాబితాలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీని తొలిసారిగా రోహిత్ అధిగమించాడు. ఇక తొలి స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఉండగా... రెండో స్థానంలో ఇండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఉన్నాడు. ప్రపంచ కప్ లో వరుసగా రెండు సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఈ జాబితాలో కోహ్లీ 9వ ర్యాంక్ లో ఉన్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి పోరులో డకౌట్‌ అయిన రోహిత్‌.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగిన విషయం తెలిసిందే.

ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన పోరులో సూపర్‌ సెంచరీ (131) చేసి ఏడో శతకం తన ఖాతాలో వేసుకొని రికార్డుల్లోకి ఎక్కిన రోహిత్‌ శర్మ.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరులో 63 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లుతో 86 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రదర్శనల వల్ల రోహిత్‌ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ముందంజ వేశాడు. 719 ర్యాంకింగ్‌ పాయింట్లు ఖాతాలో వేసుకొని ఆరో ర్యాంక్‌కు చేరిపోయాడు. భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 711 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరో విషయం ఏంటంటే.. టాప్‌-10 బ్యాటర్ల జాబితాలో భారత్‌ నుంచి ముగ్గురు ప్లేయర్లు చోటు దక్కించుకోవడం విశేషం. అత్యుత్తమంగా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండో ర్యాంక్‌లో ఉండగా.. రోహిత్‌, కోహ్లీ టాప్‌-10లో ఉన్నారు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. క్వింటన్‌ డికాక్‌ మూడో ప్లేస్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లో చూసుకుంటే.. ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హజిల్‌వుడ్‌ టాప్‌లో ఉండగా.. టీమ్‌ఇండియా నుంచి మహమ్మద్‌ సిరాజ్‌ మూడో స్థానంలో.. కుల్దీప్‌ యాదవ్‌ 8వ స్థానంలో టాప్‌-10 ర్యాంకులు దక్కించుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్‌ పాండ్యా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

Also read: గుజరాత్‌ ఫ్యాన్స్‌పై పాక్‌ వార్‌.. ఐసీసీకి ఇచ్చిన కంప్లైంట్‌లో ఏం ఉందంటే?

ఇక వన్డేల్లో సచిన్ (49), కోహ్లి (47) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‎గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇన్నాళ్లూ పాంటింగ్ (30)తో కలిసి సంయుక్తంగా మూడోస్థానంలో ఉన్న రోహిత్.. ఇప్పుడు అతడ్ని మించిపోయాడు. వరల్డ్ కప్ లలో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ పేరిట ఉన్న రికార్డును కూడా రోహిత్ అధిగమించిన సంగతి తెలిసిందే. ఇక గాయంతో 11 నెలల పాటు మ్యాచ్‌లకప దూరమై ఐర్లాండ్ సిరీస్‎తో మళ్లీ జట్టులోకి వచ్చిన బుమ్రా కూడా వరల్డ్ కప్‎లో రాణిస్తూ.. 8 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. దీంతో ర్యాంకింగ్స్ లో అతడు కగిసో రబాడాతో కలిసి 14వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు సిరాజ్ 3, కుల్దీప్ 8వ స్థానాల్లో కొనసాగుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు