Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి!

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. యూపీలోని గౌరా బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ తిరాహే ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఒక ట్రక్కు-కారు ఢీ కొనడంతో ఘటన చోటుచేసుకుంది. 

New Update
Gujarat: పండుగ వేళ విషాదం.. 10 మంది మృతి!

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని జౌన్‌పూర్‌లో శనివారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. కాగా, 3 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని వారణాసి ట్రామా సెంటర్‌కు తరలించారు. ఆ కుటుంబం బీహార్‌లోని సీతామర్హి లో నివసిస్తున్నారు.  అందరూ ఏదో పని నిమిత్తం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కి ఎర్టిగా కారులో వెళ్తున్నారు. అయితే దారిలో వారి కారును  ట్రక్కు ఢీకొట్టింది.

గౌరా బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ తిరాహేలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి 2.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం అయింది. దీంతో ఉలిక్కిపడిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా(Road Accident) స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అదేవిధంగా గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారణాసిలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది.

Also Read : రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..!

మృతుల్లో అనిల్ శర్మ, గజధర్ శర్మ, జవహర్ శర్మ, సోనమ్, గౌతమ్, రింకీ ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, గాయపడిన వారిలో మీనా శర్మ, యుగ్ శర్మ అలాగే ఒక  గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. ఈ సంఘటనపై(Road Accident) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, ట్రక్కు డ్రైవర్,  అతని సహచరుడు సంఘటనా పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఘటనా స్థలం నుంచి ట్రక్కు, కారును స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ప్రమాదం చాలా ఘోరంగా ఉంది. మృతదేహాలు కారులో బాగా ఇరుక్కుపోయాయి. అక్కడంతా రక్తంతో భయంకరంగా ఉంది.  పోలీసులు చాలా శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. కారు(Road Accident) ముక్కలైపోయింది. బాగా రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చీకటి కారణంగా.. వేగంగా వెళుతున్న రెండు వాహనాలు ఢీకొన్నాయని భావిస్తున్నారు.  ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.

షాజహాన్‌పూర్‌ ప్రమాదంలో ఐదుగురు..
సరిగ్గా ఇదే విధంగా ఐదు రోజుల క్రితం షాజహాన్‌పూర్ జిల్లా(Shahjahanpur District) లో పెళ్లికి వచ్చిన అతిథులతో కూడిన కారును ట్రక్కు(Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. కాగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం ప్రకారం, ఠాణా కలాన్ ప్రాంతంలోని అబ్దుల్లా నగర్ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు స్థానిక ప్రాంతం నుండి పెళ్లి ఊరేగింపు(Marriage Band) లో మద్నాపూర్ వెళ్లారు. ఈ వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున 2:15 గంటలకు ఇంటికి తిరిగి వస్తుండగా నర్సుయ్య గ్రామ సమీపంలో వారి కారు వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటన మర్చిపోక ముందే మరో ప్రమాదం జరగడం ప్రజలను కలవర పెడుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు