Road Accident : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి!

సూర్యాపేట జాతీయ రహదారి పై గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకునికి తీవ్రగాయాలయ్యాయి.ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

New Update
Road Accident : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి!

Suryapet Incident : సూర్యాపేట జాతీయ రహదారి పై గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)  జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకునికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆగి ఉన్న డీసీఎం ను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

అర్థరాత్రి కావడంతో పోలీసులకు సమాచారం ఆలస్యంగా రావడంతో వారు ఘటనా స్థలానికి చేరుకునే సరికి పరిస్థితులు చేయి దాటిపోయాయి. పోలీసులు చనిపోయిన వారిని మహ్మద్ నవీద్‌, నిఖిల్‌ రెడ్డి, రాకేశ్‌ లుగా గుర్తించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆదిత్యను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి(Suryapet Government Hospital) కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే(Over Speed) కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Also read: రంజాన్‌ మాసంలో బిర్యానీని తెగ లాగించిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు