AP Crime: విశాఖలో రెండు ప్రాణాలను బలిగొన్న అంబులెన్స్‌

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాభాగ్ కల్యాణి ప్రెస్ జంక్షన్‌లో బైక్‌పై వస్తున్న చందు, రామకృష్ణ అనే యువకులు రోడ్డు క్రాస్‌ చేస్తుండా.. అటుగా వస్తున్న అంబులెన్స్‌ ఢీ కొట్టింది. తీవ్రగాయాలైన యువకులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందారు.

New Update
AP Crime: విశాఖలో రెండు ప్రాణాలను బలిగొన్న అంబులెన్స్‌

Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. సూర్యాభాగ్ కల్యాణి ప్రెస్ జంక్షన్‌లో బైక్‌పై వస్తున్న చందు, రామకృష్ణ అనే  యువకులు రోడ్డు క్రాస్‌ చేస్తుండా.. అటుగా వస్తున్న అంబులెన్స్‌ ఢీ కొట్టింది. తీవ్రగాయాలైన యువకులను దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఇద్దరు మృతి చెందారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. యాక్సిడెంట్‌కు కారణమైన 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ ఈశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీ కొట్టిందా..? అంబులెన్స్‌ డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నాడ.? అతడి నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ఆరా తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను పోలీసులు సేకరించేపనిలో పడ్డారు.

ఇది కూడా చదవండి: ఏపీలో అగ్ని ప్రమాదం

Advertisment
Advertisment
తాజా కథనాలు