Collector Ashwini Tanaji Wakide: ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి

ఓటు హక్కు వినియోగంపై వరంగల్ జిల్లా కలెక్టర్‌ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఓటు హక్కును న్యాయబద్దంగా వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కును అమ్ముకునేవారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

New Update
Collector Ashwini Tanaji Wakide: ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్ అశ్విని తానజీ వాకిడే పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట నియోజకవర్గం కేంద్రంలో శనివారం కలెక్టర్ పర్యటించారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు 5కే రన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. జెండా ఊపి 5కే రన్‌ను ప్రారంభించారు. 5కే రన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి ఓటు హక్కును కల్పించిందన్నారు. ప్రజలకు ఓటే అయుదమన్న ఆమె.. ఓటర్లు తమ ఆయుదం ద్వారానే అసలైన వారిని తమ నాయకుడిగా ఎన్నుకుంటారన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా ఓటు ప్రాముఖ్యత పైన అందరితో ప్రతిజ్ఞ చేయించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మరోవైపు ఓటు హక్కు కలిగియున్న ప్రతి ఒక్కరు సక్రమంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ అశ్విని తానజీ వాకిడే పిలుపునిచ్చారు. ఓటర్లు రాజకీయ నేతల మాటలు నమ్మొద్దని, డబ్బులు తీసుకుంటే ఓట్లను అమ్ముకున్నట్లే అవుతుందన్నారు. ప్రజలు ఓట్లను అమ్ముకుంటే అది చట్ట విరుద్దం అయినట్లే అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకుంటే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: అయ్యో పాపం.. క్రేన్‌ ఢీకొని తండ్రీ కొడుకు దుర్మరణం

హనుమకొండ జిల్లాలో క్రేన్‌ వెనుక నుంచి ఢీకొట్టడంతో సైకిల్‌పై వెళ్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. మృతులు ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన తంగెడ రాజేశ్వరావు, సాగర్‌రావుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Death Hanumakonda

Hanumakonda Accident

Hanumakonda Accident: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. క్రేన్‌ వెనుక నుంచి ఢీకొట్టడంతో సైకిల్‌పై వెళ్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం కోతులనడుమ గ్రామానికి చెందిన తంగెడ రాజేశ్వరావు, లక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాగర్‌రావు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. చిన్నకుమారుడు వికాస్‌రావు (30) దివ్యాంగుడు కావడంతో ఇంటివద్దే తల్లిదండ్రులతో ఉంటున్నారు. 

క్రేన్‌ ఢీకొని..

అయితే... సంవత్సరం కిందట రోడ్డు ప్రమాదంలో భార్య లక్ష్మి తీవ్రంగా గాయ పడ్డారు. పెద్ద కుమారుడి దగ్గర ఉంటూ ఆమె అక్కడే చికిత్స చేయించుకుంటున్నారు. స్వగ్రామంలో ఉంటున్న రాజేశ్వరరావు శుక్రవారం చిన్నకుమారుడితో కలిసి సైకిల్‌ మీద వల్లభాపూర్‌లో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. హుజూరాబాద్‌ నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న క్రేన్‌ వెనుక నుంచి వచ్చి సైకిల్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కుమారులిద్దరూ అక్కడికక్కడే మృతవాత పడ్డారు.

ఇది కూడా చదవండి: పొట్టిగా ఉన్నవారు బరువు తగ్గడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు?

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్‌తోపాటు ఎస్‌ఐ ప్రవీణ్‌ పరిశీలించారు. క్రేన్‌ డ్రైవర్‌ దిల్‌షాద్‌ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఛాతీలో మంట, వికారం గుండెపోటుకు కారణమా?

Advertisment
Advertisment
Advertisment