Rahul Gandhi: రాహుల్- ప్రియాంక మధ్య గొడవలు.. అందుకే రాలేదు: బీజేపీ ప్రియాంక గాంధీ కావాలనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు దూరంగా ఉంటున్నారని బీజేపీ ఆరోపించింది. అన్నా చెల్లెల మధ్య విభేధాల కారణంగానే ఆమె రాహుల్ చేపట్టిన యాత్రలో పాల్గొనడం లేదని బీజేపీ పేర్కొంది. By Bhavana 17 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కాంగ్రెస్(Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) వాద్రా శుక్రవారం భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) లో పాల్గొనలేదు. ప్రియాంక అనారోగ్యంగా ఉండటం వల్ల ఆమె యాత్రలో పాల్గొనలేకపోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్యం మెరుగు పడిన వెంటనే ఆమె యాత్రలో పాల్గొంటారని కూడా తెలిపారు. అయితే రాహుల్ న్యాయ్ యాత్ర ప్రారంభించి 34 రోజులు. ప్రియాంక గాంధీ తొలిసారిగా ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు. అటువంటి సందర్భంలో ఆమె గైర్హాజరు కావడం పై బీజేపీ సందేహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా దీని వెనుక అన్నా చెల్లెలి మధ్య విభేధాలని ఆరోపించింది. ప్రియాంక సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తాను అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయాన్ని తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ, 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్‌కు చేరుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను, అయితే అనారోగ్యం కారణంగా నేను ఈరోజే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిన వెంటనే, నేను ప్రయాణంలో చేరతాను. అప్పటి వరకు, చందౌలీ-బనారస్ చేరుకునే ప్రయాణీకులందరికీ, ఉత్తరప్రదేశ్‌లోని నా సహచరులకు, ప్రయాణానికి శ్రద్ధగా సిద్ధమవుతున్న ప్రియమైన సోదరుడికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటూ రాసుకొచ్చారు. మరోవైపు డీహైడ్రేషన్, వికారం కారణంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రియాంక గాంధీ చేసిన ఈ క్లారిటీపై బీజేపీ (BJP) ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రియాంక గాంధీ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, 'ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. యాత్ర 2.0 ప్రారంభమైనప్పుడు కూడా, ఎక్కడ ప్రియాంక వాద్రా కనిపించలేదు, రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకున్నప్పుడు కూడా ప్రియాంక లేదు. सबको अपने स्वास्थ्य का ख़्याल रखना चाहिए। जब यात्रा 2.0 शुरू हुई तब भी प्रियंका वाडरा वहाँ से नदारद थीं, और आज जब राहुल की यात्रा उत्तर प्रदेश पहुँची है, तब भी प्रियंका वहाँ नहीं रहेंगी। पार्टी पर मिल्कियत के लिए भाई-बहन के बीच ना पटने वाली ये खाई अब सर्वविदित है। pic.twitter.com/26KaPOBeYY — Amit Malviya (@amitmalviya) February 16, 2024 అన్న చెల్లిల మధ్య అంతరం ఏర్పడిందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏమి కావాలంటూ బీజేపీ ఆరోపించింది. వారిద్దరి మధ్య విబేధాలు ఉన్న కారణంగానే ప్రియాంక ఈ యాత్రకు దూరంగా ఉంటున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ యాత్ర గత నెల జనవరి 14న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుంచి ప్రారంభమైందని, ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 20 లేదా 21న ముంబైలో ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే మార్చి రెండవ వారంలో ముంబైలో యాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 16 నుండి 21 వరకు రాయ్‌బరేలీ మరియు అమేథీల గుండా వెళుతుంది. దీని తరువాత, 22, 23 ఫిబ్రవరి యాత్రకు బ్రేక్. ఫిబ్రవరి 24, 25 తేదీలలో పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ప్రయాణం తిరిగి ప్రారంభమవుతుంది. Also read: వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్ మూడేళ్లకే ముక్కలు అయ్యింది! #congress #bjp #rahul #priyanka #bharat-jodo-nyay-yatra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి