RGV : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోటీగా డైరెక్టర్ ఆర్జీవీ.. ! జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలిసిందే. తాజాగా, డైరెక్టర్ ఆర్జీవీ సంచలన పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు పోటీగా బరిలోకి దిగుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 14 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ సినిమా New Update షేర్ చేయండి RGV To Contest From Pithapuram: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారనే దానిపై నేడు క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు. దీంతో, పిఠాపురం టీడీపీలో (TDP) అసమ్మతి సెగ రగులుతోంది. పవన్ పోటీ చేస్తాననడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేస్తోన్నారు. వర్మకు టికెట్ ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. వర్మకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు. Also Read: మనీప్లాంట్, తులసి మొక్కలు అక్కడ పెడుతున్నారా? అయితే, జాగత్ర..! ఇలా టీడీపీ జనసేన కూటమిలో రచ్చ రచ్చ జరుగుతుంటే.. మరోవైపు, డైరెక్టర్ ఆర్జీవీ సంచలన పోస్ట్ చేశారు. తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆర్జీవీకి అధికార పార్టీ వైసీపీ మద్దతు పూర్తిగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే, ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు సెటైరికల్ గా పోస్ట్ చేశారా? లేదంటే సీరియస్ గానే చెప్పారా అనేది తెలియాల్సి ఉంది. SUDDEN DECISION..Am HAPPY to inform that I am CONTESTING from PITHAPURAM 💪💐 — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024 రిసెంట్ గా RGV.. సీఎం జగన్ పొలిటికల్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా ‘వ్యూహం' (Vyooham) సినిమాను తెరెకెక్కించిన సంగతి తెలిసిందే. 2009 నుంచి 2014 వరకు జగన్ కుటుంబంలో, ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను సినిమాగా చిత్రికరించారు. జగన్ కు అనుకూలంగా తీసిన ఈ సినిమా జగన్ రాజకీయ భవిష్యత్, ఏపీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందని ఆసక్తి నెలకొంది. #pawan-kalyan #ap-elections-2024 #janasena #rgv మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి