Ap politics : కర్నూలు జిల్లా డోన్ లో రివెంజ్‌ పాలిటిక్స్

ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గంలో రివెంట్‌ పాలిటిక్స్‌ కొనసాగుతున్నాయి.

New Update
Ap politics : కర్నూలు జిల్లా డోన్ లో రివెంజ్‌ పాలిటిక్స్

AP : ఏపీలో ఎన్నికలు(AP Elections) ముగిసినప్పటికీ ఇంకా ప్రధాన పార్టీల నేతలు తమ ప్రత్యర్థులతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు(Kurnool) జిల్లా డోన్‌ నియోజకవర్గంలో రివెంట్‌ పాలిటిక్స్‌ కొనసాగుతున్నాయి. కొంత కాలం క్రితం వైసీపీ(YCP) నుంచి టీడీపీ(TDP) లోకి వచ్చిన ప్యాపిలి సింగిల్‌ విండో డైరెక్టర్‌ సీమ సుధాకర్‌ రెడ్డి, సుబ్బారెడ్డిలు.దీంతో వారు అధికార పార్టీకి ఎన్నికల సమయంలో సహకరించలేదని వైసీపీ నాయకులు కక్ష కట్టారని వారు ఆరోపిస్తున్నారు.

దీంతో పాత కేసులు తిరగతోడి ఎస్సీ, ఎస్టీ కేసుల్లో డోన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అధికారపార్టీకి ఎన్నికల్లో సహకరించలేదని టీడీపీ నాయకులు పాత కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ చేసిన వారిని తెల్లవారుజామున బనగానపల్లె స్టేషన్ కు తరలించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని లేకుంటే డీఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని ఆమె హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలోనే ఆమె ఆందోళన చేసేందుకు సిద్ధమైయ్యారు. దీంతో కోట్ల సుజాతమ్మ ఆందోళన చేపట్టకుండా ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. దీంతో పోలీసుల తీరు పై కోట్ల సుజాతమ్మ, సూర్య ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also read: అమెరికాకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన విదేశాంగ మంత్రి జై శంకర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు