Telangana New CM: సీఎం పదవిపై రేవంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్.. వారికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్..

తెలంగాణ ముఖ్యమంత్రిగా తన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

New Update
రేవంత్ రెడ్డి జాతకంలో రాజయోగం! పదవీకాలం ఎలా ఉంటుంది?

Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం(Congress) తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. డిసెంబర్ 3వ తేదీన ప్రకటించిన తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లలో ఘన విజయం సాధించి.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని పొందిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఇవాళ సాయంత్రం వరకు సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలు చర్చలు జరిపి తమ నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా అనముల రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. ఈ మేరకు ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా ప్రకటించారు.

అయితే, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన.. కాంగ్రెస్ అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌, ఠాక్రేకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు రేవంత్.

Also Read:

Telangana Elections: ‘ఈ తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది’.. కేటీఆర్ ట్వీట్..

ISRO: ‘ఆదిత్య ఎల్‌ 1’లో రికార్డయిన సౌరగాలులు.. సోషల్‌ మీడియాలో ఇస్రో ఫోటో..

Advertisment
Advertisment
తాజా కథనాలు