Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి టార్గెట్‌గా మరిన్ని దాడులు మాజీ మంత్రి మల్లారెడ్డికి, అతని అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి టీఎస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. మొన్న మల్లారెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చి వేసిన రేవంత్ సర్కార్.. తాజాగా మల్లారెడ్డి అల్లుడి విద్యాసంస్థల్లో అక్రమ కట్టడాల కూల్చివేస్తోంది. By Bhavana 08 Mar 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) కి, అతని అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి టీఎస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. మొన్న మల్లారెడ్డి కాలేజీ(Malla Reddy College) లో అక్రమ కట్టడాలను కూల్చి వేసిన రేవంత్ సర్కార్.. తాజాగా మల్లారెడ్డి అల్లుడి విద్యాసంస్థల్లో అక్రమ కట్టడాల కూల్చివేస్తోంది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన 2 శాశ్వత బిల్డింగులు, 6 తాత్కలిక షెడ్లను కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చి వేస్తున్నారు HMDA అధికారులు. 8 ఎకరాల చెరువును కబ్జా చేసి దుండిగల్ లోని MLRIT, ఏరోనాటికల్ కాలేజీల పార్కింగ్, భవనాలను MLA రాజశేఖర్ రెడ్డి నిర్మించారని గతంలో అధికారులు గుర్తించారు. దీనిపై వారం కిందట అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆయన నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి భూకబ్జాలు, భూ ఆక్రమణలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తున్న అధికారులు.ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ చేసిన ఆరోపణలపై ఫోకస్ పెట్టిన అధికారులు. శామీర్‌పేట మండలంలో గిరిజనుల భూమి కబ్జా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డి, ఆయన అల్లుడు. ఇప్పటికే శామీర్‌పేట్ మండలం కేశవరంలో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేశవపూర్‌లో సర్వే నెంబర్లు 33,34,35లో 47 ఎకరాల భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో మల్లారెడ్డిపై కేసు పెట్టిన శామీర్‌పేట పోలీసులు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో కబ్జాపై యాక్షన్ తీసుకోవడానికి అధికారులు రెడీ అయ్యారు. కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగించిన మామా అల్లుళ్లు. జేసీబీలు పెట్టి తవ్వుతున్న కళ్లు మూసుకున్న అధికారులు. వారి వద్ద నుంచి 10 గుంటల భూమిని అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపట్టిన అధికారులు. Also Read : డొక్కు సైకిల్‌పై తిరిగిన మల్లారెడ్డి..వందల కోట్లకు ఎలా ఎదిగారు? #brs #revanth-reddy #politics #minister-malla-reddy #rajasekhar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి