army jawan: జగిత్యాలలో విషాదం..బావిలో దూకి సైనికుడు ఆత్మహత్య

రిటైర్డ్ ఆర్మీ జవాన్ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. హఠాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోయి చివరకు తన వ్యవసాయ బావిలోనే శవమై తేలాడు.

New Update
army jawan: జగిత్యాలలో విషాదం..బావిలో దూకి సైనికుడు ఆత్మహత్య

బావిలోనే శవమై...  

రిటైర్డ్ ఆర్మీ జవాన్ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. 3 ఏళ్లుగా తన ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. హఠాత్తుగా శుక్రవారం (నిన్న) సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయి చివరకు తన వ్యవసాయ బావిలోనే శవమై తేలాడు. చనిపోయే ముందు కాళ్లు, చేతులను ఇనుప తీగతో కట్టి బంధించుకుని బావిలో దూకినట్లు కనిపిస్తోంది.

రిటర్మెంట్  తీసుకుని..

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుంది. రిటైర్డ్ ఆర్మీ జవాన్ నేమిళ్ల సురేంధర్ (44) ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈరోజు శనివారం ఉదయం తన వ్యవసాయ భూమి వద్ద బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత 15 సంవత్సరాల క్రితం ఆర్మీ జవాన్‌గా జమ్మూకాశ్మీర్, వివిధ ప్రాంతాల్లో సురేంధర్ విధులు నిర్వహించారు. గత రెండు సంవత్సరాల క్రితం రిటర్మెంట్ తీసుకుని.. సురేంధర్ ఇంటి వద్ద ఉన్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్నాడు.

మనస్థాపంతో..

అయితే.. సురేంధర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు, కూతురు కాగా కొడుకు మానసిక పరిస్థితి బాగలేదు. సరిగా కళ్ళు కడగబడకపోవడంతో గత కొంతకాలంగా ఆసుపత్రి చుట్టూ తిరిగాడు. ఆస్పత్రిలో చుట్టూ తిరిగిన బాగా కావడం లేదని మనస్థాపనికి గురి చెందిన సురేందర్ నిన్న సాయంత్రం సమయంలో వ్యవసాయ భూమికి వెళ్లి ఇంటికి ఫోన్ చేశాడు. తన పిల్లలను బాగా చూసుకోవాలని భార్యకు చెప్పి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. రెండు కాళ్లకు సెంట్రింగ్ తీగలు చుట్టుకుని శరీరానికి బండకట్టుకొని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్మీ జవాన్‌గా దేశానికి ఎన్నో సేవలు అందించి సురేంధర్, ఇలా ఆత్మహత్యకు పాల్పడడంతో తాజా గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అమ్ముకున్నాయి. ప్రతీరోజూ సాయంత్రం తానే స్వయంగా వచ్చి పిల్లలను స్కూల్‌ నుంచి ఇంటికి తీసుకెళ్లే వాడు. నిన్న స్కూల్‌కు కూడా వెళ్లలేదని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.

దేశం కోసం త్యాగం

దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధమై జవాన్‌గా మాతృభూమికి సేవ చేశాడు నేమిళ్ల సురేంధర్. ఇంతలో ఏమైదో తెలియదు.. హఠాత్తుగా బావిలో దూకి సురేంధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దేశం కోసం త్యాగం చేయాలనుకున్న సురేంధర్.. ప్రాణాలు బలవన్మరణంతో త్యాగం చేసి కుటుంబానికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోవటంతో... పైడిమడుగు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన గ్రామ ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. ఇక ఈ ఘటనపై సంఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు