TSRTC: మహిళలకు తెలంగాణ ఆర్టీసీ షాక్.. పురుషులకు ప్రత్యేక సీట్లు!

TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఉండే 55 సీట్లలో కనీసం 20 సీట్లు మగాళ్లకు రిజర్వ్‌ చేసే ఛాన్స్‌ ఉందని, దీనిపై త్వరలోనే ఆర్టీసీ అధికారులనుంచి ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.

New Update
TSRTC: మహిళలకు తెలంగాణ ఆర్టీసీ షాక్.. పురుషులకు ప్రత్యేక సీట్లు!

TSRTC : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ (RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ, పల్లె వెలుగు బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు లక్షల సంఖ్యలో మహిళలు బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. బస్సుల్లో ఎక్కేందుకు ఎగబడుతున్న మహిళలు డ్రైవర్ సీట్లలోనుంచి వెళ్లి బస్సుల్లో ఎక్కి కూర్చుంటున్నారు. చిన్న చిన్న అవసరాలకోసం కూడా బస్సును వాడుకుంటున్నారు. మరికొంతమంది బ్యూటీ పార్లర్, మార్కెట్ వెళ్లేందుకు కూడా బస్సు ఎక్కి వెళ్తున్న సంఘటనలు తారసపడుతుండటం విశేషం. కాగా ఈ ఎఫెక్ట్ తో పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులో పురుషులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే నిండిపోవడంతో టికెట్ కొని గంటల తరబడి ప్రయాణం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మగాళ్లు ఎక్కేందుకు కూడా అవకాశం లేకుండా పోతుంది. దీంతో చాలామంది గవర్నమెంట్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులిచ్చి ఎందుకు నిలబడాలంటూ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ అధికారులు పురుషులకు ప్రత్యేక సీట్ల ఏర్పాటుపై కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు రిజర్వ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఉండే 55 సీట్లలో కనీసం 20 సీట్లు మగాళ్లకు రిజర్వ్‌ చేసే ఛాన్స్‌ ఉందని, దీనిపై త్వరలోనే ఆర్టీసీ అధికారులనుంచి ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని డిపోల నుంచి అర్టీసీ అధికారులు సమాచారం సేకరణ చేపడుతున్నారు. పురుషులకు సీట్లు కేటాయిస్తే మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందా? మారింత సమస్యపూరితంగా మారుతుందా? అనే అంశాలపై మంత్రులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపో మేనేజర్ల అభిప్రాయాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారట. టిక్కెట్‌ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ పురుషులు నిలదీస్తున్నారని, తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కండక్టర్, డ్రైవర్లు డిపో యాజమాన్యానికి రోజు ఫిర్యాదులు అందుతున్నాయట.

ఇది కూడా చదవండి :తండ్రిపై అల్లు అర్జున్ సంచలన ఆరోపణలు.. ఆ సినిమా డబ్బులివ్వలేదంటూ

ఇదిలావుంటే.. ఇటీవలే నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు పురుషులకు బస్సుల్లో వసతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. మహిళలు వారికి కేటాయించిన సీట్లే కాకుండా పురుషుల సీట్లలోనూ కూర్చుంటున్నారని దాంతో అత్యవసరంగా వెళ్లే తమకు సీట్లు దొరకటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే దొరికిందే అవకాశం అన్నట్లు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు వాటిని చిన్న చిన్న గ్రామాల స్టేజ్ ల దగ్గర ఆపాలని కోరడంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఎక్స్ ప్రెస్ నిర్దేశించిన స్టాప్ లోనే ఆగుతాయని, మహిళలు గమనించి పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!

రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.

New Update

TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు. 

కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..

ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

పొంగులేటి కౌంటర్..

అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. 

kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment