Impact player: ఐపీఎల్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఔట్.. ఆల్ రౌండర్లకు శాపంగా మారడంతో! ఐపీఎల్‌లో గతేడాది ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నిబంధన ఆల్ రౌండర్లకు శాపంగా మారిందంటూ పలువురు మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సీజన్ లో ఈ రూల్ తొలగించాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. By srinivas 08 May 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL: ఐపీఎల్ టోర్నమెంట్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ (impact player rule)పై క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. గతేడాది ఐపీఎల్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రూల్ క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని పలువురు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన కారణంగా ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని, సరైనా అవకాశాలు రావట్లేదంటున్నారు. ఈ 17వ సీజన్ లో పలు ఉదాహరణలు చూపిస్తూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆల్‌రౌండర్లపై పెనుప్రభావం.. ఈ మేరకు ఇంపాక్ట్ రూల్ ఆల్‌రౌండర్లపై పెనుప్రభావం చూపుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు ఆల్‌రౌండర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించుతోంది. దీంతో అతడికి బౌలింగ్ చేసే అవకాశం లేకుండాపోతుంది. ఇప్పటికే చిన్న మైదానాల్లో పవర్ హిట్టింగ్ వల్ల భారీ స్కోర్లు నమోదవుతుండగా.. ఇంపాక్ట్ రూల్ బౌలర్ల కష్టాలను మరింత రెట్టింపు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్లో 200 పరుగులు చాలాసార్లు నమోదయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై అదనపు బ్యాటర్ ఉంటే బౌలింగ్ చేసే జట్టుకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇటీవల స్టేడియాల సైజు సరిపోవట్లేదని, బౌలర్లకు కష్టంగా ఉంటుందని అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో పలువురు మాజీలు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తొలగించాలని డిమాండ్ చేస్తు్న్నారు. వచ్చే సీజన్ లో ఎట్టి పరిస్థితుల్లో దీనిని దూరం పెట్టి యువ క్రికెటర్లకు మేలు చేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: IPL: సంజూకు షాక్ ఇచ్చిన ఐపీఎల్ అడ్వైజరీ.. భారీ జరిమానా! ఇదిలావుంటే.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సైతం ఇంపాక్ట్ నిబంధను వ్యతిరేకించారు. ఈ రూల్ తనకు నచ్చలేదని, ఇండియన్ క్రికెట్ కు ఇది మంచిది కాదంటూ కుండ బద్ధలు కొట్టాడు. #ipl #impact-player మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి