చంద్రమోహన్ పై ఆ ఉన్న అపవాదు ఇదే.. డైరెక్టర్ రేలంగి సంచలన విషయాలు!

నటుడు చంద్రమోహన్ గురించి ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన రేలంగి నరసింహరావు ప్రస్తావించారు. ఆయన తిండి విషయంలో తప్ప మిగతా ఏ విషయంలోనూ ఆయనను వేలెత్తి చూపడానికి లేదని పేర్కొన్నారు.ఆ జిహ్వాచాపల్యం కూడా దేవుడిచ్చిన వరం అని అన్నారు.

New Update
చంద్రమోహన్ పై ఆ ఉన్న అపవాదు ఇదే.. డైరెక్టర్ రేలంగి సంచలన విషయాలు!

అటు జంధ్యాలకీ--ఇటు ఈవీవీకి మధ్యలో హాస్య కథా చిత్రాలతో ప్రేక్షకులను నాన్‌ స్టాప్‌ గా నవ్వించిన దర్శకుడిగా రేలంగి నరసింహారావు గురించి సినీ ఇండస్ట్రీ చెప్పుకుంటుంది. ఆయన ఇప్పటి వరకు 75 సినిమాలను ప్రేక్షకుల ముందుఉకు తీసుకుని వచ్చారు. వాటిలో కేవలం ఆరు సినిమాలు తప్ప మిగతావన్నీ కూడా హాస్యభరితమైనవే.

ఆయన అప్పటి తరం నటులలో చంద్రమోహన్‌ తో సుమారు 24 సినిమాలు వరకు తీశారు. వీరిద్దరికి కూడా మంచి బాండింగ్‌ అనేది ఉండేది. అప్పట్లో చంద్రమోహన్ మీద ఓ అపవాదు ఉండేది. దాని గురించి రేలంగి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఆ అపవాదు ఏంటంటే.. ఆయన సినిమా సెట్స్ లో చాలా తినేవారు అని.

దాని గురించి రేలంగి మాట్లాడుతూ..అవును ఆయన తినేవారు..ఆయనకి కొంచెం జిహ్వా చాపల్యం ఎక్కువ. ఆ ఒక్కటి తప్ప ఆయన ఏనాడు కూడా నిర్మాతలకు కానీ, డైరెక్టర్‌ లకి కానీ అన్యాయం చేసింది లేదు. ఆయన కాల్షీట్లు ఇచ్చారు అంటే ఆ సినిమా కచ్చితంగా చేసి తీరేవారు. కరెక్ట్‌ టైమ్‌ కి వచ్చేవారు.ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్‌ కూడా చాలా బాగా చేసేవారు.

సెట్స్‌ లో అందరితో చాలా సరదాగా ఉండేవారు. ఆయన కళ అంటే చాలా గౌరవం ఇస్తారు. ఒక్క తిండి విషయంలోనే ఆయన ఎవరి మాట వినేవారు కాదు. ఏ సమయం అని కూడా చూసేవారు కాదు. అందుకే ఆయనని అందరూ తిండిప్రియుడు అంటారని రేలంగి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

శనివారం ఉదయం చంద్రమోహన్‌ అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ క్రమంలో ఆయన పాత ఇంటర్వ్యూలు చాలా వైరల్‌ అవుతున్నాయి. ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన రేలంగి నరసింహరావు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సినీ పరిశ్రమలో చంద్రమోహన్ లేనిలోటు పూడ్చలేనిదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇక చంద్రమోహన్ అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

చంద్రమోహన్ మొత్తంగా తన 55 ఏళ్ల సినీ కెరీర్‌లో 932 సినిమాల్లో నటించారు. రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో అతడి నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1987లోనూ ‘చందమామ రావే’ కోసం నంది అవార్డులు దక్కించుకున్నారు.

Also read: పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం!

Advertisment
Advertisment
తాజా కథనాలు