వన్నె తగ్గిన పసిడి..డిమాండ్లో పతనం..!! భారతీయులకు బంగారం మక్కువ ఎక్కువ. అదొక స్టేటస్ సింబల్. అంతేకాదు ఎప్పుడైనా కష్టాలు ఎదురైతే...ఆదుకునే గొప్ప సాధనం బంగారం. చాలామంది భారతీయులు తమ కష్టార్జితాన్ని శక్తిమేకు బంగారం కొనుగోలుకు ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ తక్కవ ధరకు బంగారం దొరికితే అక్కడ కొనుగోలు చేస్తుంటారు. భారతదేశం తన బంగారం అవసరాలను తీర్చుకునేందుకు 90శాతం దిగుమతులు చేసుకుంటుంది. 2022లో విదేశాల నుంచి 706 టన్నుల బంగారం భారత్ కు దిగుమతి అయ్యింది. By Bhoomi 02 Aug 2023 in బిజినెస్ New Update షేర్ చేయండి భారతీయులకు, బంగారానికి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. రోజురోజుకూ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడు కొనుగోలు చేద్దామని ఆసక్తిగా ఎదురుచూసే మహిళలు ఎంతోమంది ఉంటారు. అధిక ధరలతో ప్రజల ఆదాయం గణనీయంగా పడిపోవడానికి తోడు హెచ్చు బంగారం ధరలు నేపథ్యంలో పసిడికి డిమాండ్ తగ్గింది. రికార్డ్ స్థాయికి చేరిని బంగారం ధరలు అమ్మకాలను దెబ్బతీస్తున్నాయి. వాల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం...ప్రస్తుత ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో మనదేశంలో బంగారం అమ్మకాలు 7శాతం పతనమై 158.1టన్నుల వరకు తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 170.7టన్నుల డిమాండ్ ఉంది. ఈమధ్యే ఆర్బిఐ రూ. 2వేల నోట్లను ఉపసంహరింకోవడం కూడా పసిడి అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఏడాది తొలి 6నెలలకాలంలో బంగారం డిమాండ్ 271 టన్నులుగా అంచనా వేసింది డబ్య్లూజిసి. 2023లో మొత్తం డిమాండ్ 650 నుంచి 750టన్నుల మధ్య ఉండే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచంలో అత్యధిక బంగారం వినియోగించే దేశాల్లో మనదేశం రెండో స్థానంలో ఉంది. మంగళవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 160 పెరిగి రూ. 60,440గా ఉంది. 22క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగిరూ. 55,400గా నమోదు అయ్యింది. కిలో వెండిపై రూ. 1000పెరిగి రూ. 81వేలు పలికింది. ప్రస్తుతం రికార్డుస్థాయిలో పెరిగిన బంగారం ధరల నేపథ్యంలో డిమాండ్ తగ్గిపోయింది. బంగారం ధరలు వినియోగదారుల సెంటిమెంట్ పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 60వేలు దాటి. దేశంలో పన్ను వర్తింపు డిమాండ్ లో కొంత తగ్గుదలకు కారణమైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజినల్ సీఈవో సోమసుందరం అన్నారు. భారతీయులు ఎక్కడ పసిడి ధర తక్కువగా ఉంటే అక్కడ కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే భూటాన్ తో తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయవచ్చన్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని నమ్మాలంటే కొన్ని నెలల క్రితం అంటే ఫిబ్రవరి 21న పన్ను రహిత బంగారాన్ని దేశంలో విక్రయించనున్నామని భూటన్ తెలిపింది. దీంతో భారతీయులతోపాటు ఇతర దేశాలకు చెందినవారు కూడా ప్రయోజనం పొందనున్నారు. ఇప్పటివరకు తక్కువ ధరకు బంగారం కొనాలంటే దుబాయ్,భూటాన్ కు వెళ్లడానికి కారణం ఇదే. #india #gold-price #bhutan #indian-rupees #india-gold-price మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి