Stress and Heart Health: ఈ చిట్కాలతో ఒత్తిడి తగ్గుతుంది.. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది! గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం అవసరం. స్నేహితులు, ఇష్టమైన వాళ్లతో సమస్యలు చెప్పుకున్నా ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం, యోగా, ప్రకృతిలో గడపటం, ఆనందం, విశ్రాంతిని అందించే పనులతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. By Vijaya Nimma 27 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Stress and Heart Health: ప్రపంచంలో ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనలో ఎక్కువ మంది ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అందరూ ప్రతినిత్యం ఏతో రకంగా ఒత్తిడితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇది సాధారణమే అయినా.. దీర్ఘకాలిక ఒత్తిడి అనేది మన ఆరోగ్యంపై, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం భారతీయులు ఎక్కువగా ఒత్తిడి, మానసిక ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని చెబుస్తున్నారు. ప్రస్తుత ఎక్కువగా పని విధానం, ఆర్థిక పరిస్థితులతో ఒత్తిడి గురవుతున్నట్లు తెలిపారు. అయితే ఒత్తిడిని నుంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం తీసుకోవలసిన కొన్ని చర్యల గురించి ఇప్పడు తెలుసుకుందాం. 1. గుండెకు మేలు చేసే ఆహారాలు: ఒత్తిడిని తగ్గి, గుండె ఆరోగ్యానికి పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఫుడ్‌పై దృష్టి పెట్టాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, స్వీట్స్‌తో ఉన్న స్నాక్స్ , అధిక సోడియం ఉన్న ఆహార పదార్థాలను తగిస్తే మంచిది. 2. సమస్యలను పంచుకోవటం: స్నేహితులు, ఇష్టమైన వాళ్లతో సమస్యలు చెప్పుకున్న ఒత్తిడి తగ్గుతుంది. మీకు బాగా నమ్మకస్తులతో సమస్యలు గురించి చెప్పిన కొన్నిసార్లు మీ భావాలను, ఆందోళనలను పంచుకోని మంచి పరిష్కారం ఇస్తారు. 3. యాక్టివ్‌గా ఉండాలి: రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒత్తిడిని తగిస్తుంది. ఏరోబిక్ వ్యాయామాలు, వేగంగా నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వారానికి కనీసం 150 నిమిషాల చేస్తే గుండె ఆరోగ్యాన్ని కాపాడి, ఒత్తిని నుంచి బయటపడుతారు. 4. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత: మానసికంగా, శారీరకంగా జాగ్రత్తగా ఉంటూ ధ్యానం, యోగా, ప్రకృతిలో గడపటం, ఆనందం, విశ్రాంతిని అందించే కార్యకలాపాలను చేయాలి. ఇలా స్వీయ-సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంటే ఒత్తిడి , శారీరక , మానసిక సమస్యలను తగ్గుతాయి. 5.మనస్సును ప్రశాంతంగా: మైండ్‌ఫుల్‌నెస్ , రిలాక్సేషన్ పద్ధతులు ఒత్తిడి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శ్వాస, కండరాల వ్యాయామాలు, ధ్యానం వంటివి ప్రతీరోజూ చేస్తే భావోద్వేగలను తగ్గించి మంచి నిద్ర, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. 6. ఇతర కారణాలు: ఈ ఒత్తిడి అనేది జీవితంలో ఒక భాగమని గుర్తుంచుకోవాలి. మీ జీవితాన్ని, గుండె ఆరోగ్యానికి హాని కలిగించకూడదు. ఇలాంటి వ్యూహాలను రోజువారి దినచర్యలో పాటిస్తే ఒత్తిడిని తగ్గి.. గుండెను రక్షించుకోవచ్చు అని వైద్యులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తే గుండె జబ్బుల ప్రమాదాలు తగ్గి.. సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని పొందవచ్చు. ఇది కూడా చదవండి: బరువు తగ్గించే ఆకు కూరలు ఇవే..షుగర్ కూడా తగ్గుతుంది #health-benefits #health #reduce-stress #tips-good-heart మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి