Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ అలర్ట్.. కల్కి రిలీజ్ డేట్ మారింది!

వైజయంతి పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జానర్ లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా కల్కి 2898 ఏడి. మొదట మే 9 వతేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడిందని.. జూలై 12న రిలీజ్ అని తెలుస్తోంది. 

New Update
Kalki First Review : కల్కి.. మొదటి  రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే.. 

Kalki 2898 AD Release Date: పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తోంది అంటే అభిమానులకు పండగే. ఇటీవలే సలార్ తో ఇండియన్ స్క్రీన్ పై సంచలనం సృష్టించిన ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ (Prabhas) లైనప్ కూడా చాలా పెద్దగా ఉంది. అయితే, ఇందులో త్వరలో రిలీజ్ కావడానికి ముస్తాబవుతున్నా సినిమా  కల్కి 2898 ఏడి(Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ బేనర్ పై సైన్స్ ఫిక్షన్ జానర్ లో భారీస్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో ఉత్కంఠ నింపుతోంది. ఎందుకంటే, దీని దర్శకుడు నాగ్ అశ్విన్ కావడమే. నాగ్ అశ్విన్ (Nag Ashwin) - ప్రభాస్ కాంబినేషన్ అనేసరికి క్రేజీగా మారింది. 

KALKI PRABHAS

Also Read: హాస్యానికి కేరాఫ్ ఎడ్రస్.. ది వన్ అండ్ ఓన్లీ కామెడీ కింగ్ చార్లీ చాప్లిన్!

షూటింగ్ పార్ట్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్న కల్కి సినిమా రిలీజ్ డేట్ ఇటీవల ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా మే 9న థియేటర్లలోకి వస్తోందని ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ తేదీ మారిందని తెలుస్తోంది. రెండు నెలలు ఆలస్యంగా కల్కి  ప్రేక్షకుల ముందుకు వస్తారని అంటున్నారు. ఎందుకంటే, ఇంకా సీజే వర్క్ పూర్తి కాకపోవడం.. దానికి మరికాస్త టైం పెట్టె అవకాశం ఉండడంతో సినిమా విడుదల వాయిదా పడుతోందని చెబుతున్నారు. అదీకాకుండా, మే నెలలో ఎన్నికలు .. జూన్ లో లెక్కింపు ఉండడంతో సినిమా ను ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోందట. అందుకోసమే, సినిమాను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్ జూలై 12 అని అనధికారికంగా చెప్పుకుంటున్నారు. అధికారికంగా ఈ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా విడుదల మాత్రం కచ్చితంగా వాయిదా పడినట్లే అని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. కొత్త డేట్ విషయంలో మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని.. అప్పుడు అఫీషియల్ గా ప్రకటన వస్తుందని చెప్పుకుంటున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు