Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్‌ లో రియాక్టర్‌ పేలుడు..18 కి చేరిన మృతుల సంఖ్య!

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌ లో రియాక్టర్‌ పేలిన ఘటన లో చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. పేలుడు ధాటికి గోడ, మొదటి అంతస్తు శ్లాబ్‌ కూలడంతో శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండిపోయినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
BIG BREAKING: భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవ దహనం

Andhra Pradesh: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌ లో రియాక్టర్‌ పేలిన ఘటన లో చనిపోయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. పేలుడు ధాటికి గోడతో పాటు మొదటి అంతస్తు శ్లాబ్‌ కూలడంతో శిథిలాల కింద చాలామంది నలిగిపోయారు. దీంతో శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన వారిని చిన్నారావు, రాజశేఖర్‌, మహేశ్‌, సన్యాసి నాయుడు, రామిరెడ్డి, పార్థసారథి, గణేశ్‌, ప్రశాంత్‌, నారాయణ, హారిక, మోహన్‌ గా గుర్తించారు.

ఈ ఘటనలో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్‌ పేలింది. భారీ పేలుడు కారణంగా తీవ్రమైన మంటలు చెలరేగాయి.

పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 300 మంది కార్మికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వానలే వానలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు