88 శాతం వెనక్కి వచ్చిన రూ. 2వేల నోట్లు.. ఇంకా మిగిలింది ఎంతంటే...!

New Update
88 శాతం వెనక్కి వచ్చిన రూ. 2వేల నోట్లు.. ఇంకా మిగిలింది ఎంతంటే...!

చలామణిలో వున్న రూ. 2వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించన నేపథ్యంలో భారీగా నోట్లు బ్యాంకులకు చేరుతున్నాయి. జూలై 31 నాటికి చలామణిలో వున్న రూ. 2వేల నోట్లలో 88 శాతం లేదా రూ. 3.14 లక్షల కోట్ల విలువైన నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చి చేరాయి. దీంతో మరో 0.42 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే చలామణిలో వున్నాయని ఆర్బీఐ పేర్కొంది.

బ్యాంకులకు చేరిన వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల ద్వారా వచ్చాయని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. మరో 13 శాతం ఇతర డినామినేషన్ల ద్వారా నోట్లను వినియోగదారులు మార్చుకున్నారని పేర్కొంది. ఇంకా కొద్ది కాలమే మిగిలి వుందని అందువల్ల ప్రజలు తమ దగ్గర వున్న రూ. 2 వేల నోట్లను తొందరగా మార్చుకోవాలని సూచించింది.

ఈ ఏడాది మే 19న రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్బీఐ చెప్పింది. మార్చి 31 నాటికి రూ. 3.62 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు చలామణీలో వున్నాయి. మే 19 నాటికి ఆ మొత్తం రూ.3.56 లక్షల కోట్లకు వరకు తగ్గినట్టు వివరించింది.

ఇక బ్యాంకుల్లో సామాన్య ప్రజలు రూ. 2వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. అప్పటి వరకు రూ. 2 వేల నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. జులై 31 నాటికి బ్యాంకుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా 88 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు