Ravi Tree Benefits: రావి చెట్టుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం.. ఈ చిట్కాలు తెలుసుకుంటే అంతా ఆనందమే! హిందూ సాంప్రదాయం ప్రకారం రావి చెట్టును దైవ చెట్టుగా కొలుస్తారు. ఆయుర్వేదం ప్రకారం రావిచెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. సీజనల్ వ్యాధులైన జ్వరం, దగ్గు, జలుబు లాంటి సమస్యలను దూరం చేసి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో రావి చెట్టు బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 25 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Ravi Tree Benefits: హిందూ సాంప్రదాయం ప్రకారం రావి చెట్టును దైవ చెట్టుగా కొలుస్తారు. అంతేకాదు ఎంతో భక్త శ్రద్ధలతో ఈ చెట్టుకు పూజలు కూడా చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం రావిచెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు సీజనల్ వ్యాధులైన జ్వరం, దగ్గు, జలుబు, వంటి సమస్యలను దూరం చేయడంలో ఈ రావి చెట్టు ఒకటి. ఇంకా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో బెస్ట్ చెట్టుగా చెబుతున్నారు. చాలామంది నతి సమస్యతో బాధపడుతున్న అలాంటివారు పండిన రావి చెట్టు పండును ఎండబెట్టి పౌడర్ చేసుకుని తేనెతో తింటే ఈ సమస్య పోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ చెట్టులో ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలను దూరం చేస్తుందో ఇప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. రావి చెట్టు ఆకులతో కలిగే ప్రయోజనాలు: కొంతమంది నత్తి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు రావిచెట్టి పండ్లను ఎండబెట్టి పౌడర్ చేసుకుని దాన్ని తేనెతో కలిపి తీసుకుంటే. ఈ సమస్య దూరం అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా రావిచెట్టి ఆకుల్ని నమిలి తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ రావి చెట్టు డయేరియా తగ్గించడంలో బాగా సహాయం పడుతుంది. కాండం, ధనియాలు, పట్టిక బెల్లం మూడిటినీ కలిపి రోజుకు మూడు నుంచి నాలుగు గ్రాములు తింటే డయేరియా సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా బాగా పండిన రావిచెట్టు పండ్లను తింటే ఆకలి పెరుగుతుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేయడంలో రావి చెట్టు ఈ ఆకుల రసం బెస్ట్. దీనిని తాగటం వల్ల వయసుతో వచ్చే సమస్యలు దూరం అవుతాయి. పాదాల్లో పగుళ్ళ సమస్య ఉంటే ఈ ఆకుల రసాన్ని రాసుకుంటే ఆ సమస్య పోతుంది. అంతేకాకుండా రావిచెట్టు పుల్లలతో దంతాలు తోముకుంటే ఎలాంటి దంత సమస్యలు రావని చెబుతున్నారు. ఈ ఆకుల రాసం చర్మంపై రాస్తే మచ్చలు, పింపుల్స్ అన్నీ దూరమై అందంగా మారుతుంది. చర్మంపై ముడతలు కూడా దూరం అవుతాయి. ఆకుల రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలైన గ్యాస్, కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: వేరుశెనగ నూనెతో అందం.. ఆరోగ్యం.. ఇలా ట్రై చేసి చూడండి! #health-benefits #benefits #ravi-tree మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి