T20 World Cup : ఐసీసీ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించిందా!? వాన్‌కు ఇచ్చిపడేసిన రవిశాస్త్రి! టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో ఐసీసీ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించిందంటూ మైకెల్ వాన్ చేసిన వ్యాఖ్యలకు రవిశాస్త్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మైకెల్ వాన్ ఏది పడితే అది మాట్లాడుతాడు. అతని మాటలను ఎవరూ పట్టించుకోరు. సెమీస్‌లో ఇంగ్లాండ్ ఎలా ఓడిందనే దానిపై దృష్టిపెడితే మంచిదన్నాడు. By srinivas 06 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ravi Shastri : ఐసీసీ (ICC) భారత్ కు అనుకూలంగా వ్యవహరించిందంటూ మైకెల్ వాన్ చేసిన సంచలన వ్యాఖ్యలను ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తిప్పికొట్టారు. మైకెల్ వాన్ ఏది పడితే అది మాట్లాడుతుంటాడు. ఆయన మాటలు ఎవరూ పట్టించుకోరు. అందుకే భారత్ పట్ల వంకరగా మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు దక్షిణాఫ్రికా (South Africa) తో జరిగిన సెమీస్‌లో అఫ్గానిస్థాన్ (Afghanistan) ఓటమిపాలైన అనంతరం వాన్ మాట్లాడుతూ.. టోర్నమెంట్ షెడ్యుల్‌ను ఐసీసీ భారత్‌కు అనుకూలంగా తయారు చేసిందన్నాడు వాన్. అఫ్గాన్ ఆటగాళ్లు సెమీస్ కోసం ట్రినిడాడ్‌కు వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఎందుకు ఆలస్యమైంది. ఈ కారణంగా వారికి ప్రాక్టీస్ చేసే సమయం కూడా దొరకలేదన్నాడు. Well done, @JayShah. Your new name is Jay Nostradamus Shah. You appointed @ImRo45 captain 4 months ago and predicted India will lift the cup today. pic.twitter.com/IJqyCxGpUl — Ravi Shastri (@RaviShastriOfc) June 30, 2024 అయితే తాజాగా వాన్ కామెంట్స్ పై స్పందించిన రవిశాస్త్రి.. ‘మైకెల్ వాన్ (Michael Van) ఏది పడితే అది మాట్లాడుతాడు. అతని మాటలను భారత్‌లో ఎవరూ పట్టించుకోరు. సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ ఎందుకు ఓడిందనే దానిపై దృష్టిపెడితే మంచిది. భారత్ నాలుగు ట్రోఫీలు సాధించింది. ఇంగ్లాండ్ రెండు సార్లు కప్పు గెలిచింది. కానీ, మైకెల్ వాన్ ఒక్కసారైనా ప్రపంచకప్ సాధించలేదు’ అంటూ పరువు తీసేశాడు. Also Read : తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ-LIVE #icc #2024-t20-world-cup #ravi-shastri #michael-van మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి